Site icon HashtagU Telugu

Exit Polls 2024 : ఏపీలో కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్

Epexit

Epexit

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన పోలింగ్ కు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ వచ్చేస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంచెపుతాయో..? ఎవరు గెలుస్తారని చెపుతాయో..? తెలుసుకోవాలని అంత ఎదురుచూడగా…వారి ఎదురుచూపులు తెరదించుతూ అనేక సర్వే సంస్థలు తమకు అందిన రిపోర్ట్ ను తెలియజేస్తున్నారు. ముఖ్యముగా ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అరా తీస్తుండగా..అన్ని సర్వే సంస్థలు ఏపీలో కూటమి భారీ విజయం సాదించబోతున్నట్లు తేల్చి చెపుతున్నాయి. కూటమి ముఖ్య నేతలు భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని..వైసీపీ మంత్రులు ఎక్కువ శాతం ఓటమి చెందుతున్నారని తేల్చి చెపుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని, కుప్పంలో చంద్రబాబు గెలువబోతున్నారని , పులివెందుల లో జగన్ గెలుస్తున్నాడని చెపుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

పూర్తి ఎగ్జిట్ పోల్స్ చూస్తే..

ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ : ఇరవై ఐదు లోక్ సభ సీట్లలో 21 నుంచి 25 సీట్లు కూటమి పార్టీలు సాధించే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్‌సీకి 0 నుంచి 4 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. అంటే వైసీపీ ఖచ్చితంగా గెలిచే లోక్ సభ సీటు ఒక్కటి కూడా లేదని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

పీపుల్స్ పల్స్ : టీడీపీకి 95-100 సీట్లు

ఏపీలో టీడీపీకి 95-110 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. వైసీపీ కేవలం 45-60 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. జనసేన 14-20, బీజేపీ 2-5 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఇక లోక్సభ స్థానాల్లో టీడీపీ 13-15 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వైసీపీ 3-5, జనసేన 2, బీజేపీ 2-4 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది.

సర్వే సంస్థ – RING2POLL
అసెంబ్లీ
కూటమి – 115 సీట్లు
వైసీపీ – 60 సీట్లు

పార్లమెంట్
కూటమి – 14-17
వైసీపీ – 8-11

సర్వే సంస్థ – National Family Opinion Pvt Ltd
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 104 – 110
వైసీపీ – 65 – 71

పార్లమెంట్
టీడీపీ కూటమి – 15-18
వైసీపీ – 7-10

సర్వే సంస్థ – SAS Group (Sri Atma Sakshi Group)
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 59-77
వైసీపీ – 98-116

పార్లమెంట్
టీడీపీ కూటమి – 8
వైపీపీ – 16

సర్వే సంస్థ – Q MEGA
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 50-60
వైసీపీ – 120

సర్వే సంస్థ – HMR
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 73-83
వైసీపీ – 91-101

సర్వే సంస్థ – NDT
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 108-126
వైసీపీ – 49-69

సర్వే సంస్థ – AP Connect
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 131
వైసీపీ – 44

సర్వే సంస్థ – POLL PULSE
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 108-116
వైసీపీ – 48-56

సర్వే సంస్థ – PEOPLE PULSE
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 111-135
వైసీపీ – 45-60

Read Also : Exit Poll 2024 : ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా…జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నాం – జగన్