Site icon HashtagU Telugu

Ex Minister Roja : వైసీపీ ని వీడడం ఫై మాజీ మంత్రి రోజా క్లారిటీ

Roja Clarity On Ycp Resign

Roja Clarity On Ycp Resign

వైసీపీ ప్రభుత్వం (YCP Govt)లో రోజా (Ex Minister Roja) ఆడిందే ఆట..పాడిందే పాట..వేసేందే చిందు అన్నట్లు సాగింది. నగరి ప్రజలు ఆమెకు ఎమ్మెల్యే పదవి అప్పగించిన..జగన్ మంత్రి పదవి కట్టబెట్టిన ఆమె ప్రజలకు చేసింది ఏమి లేదు. పైగా వచ్చిన నిధులను స్వాహా చేయడమే కాదు..నియోజకవర్గంలో ఏ షాప్ ప్రారంభమైన..ఏది జరిగిన ఆమెకు కమిషన్ వెళ్లాల్సిందే. ఆలా కమిషన్లు నొక్కేస్తూ..నిధులు నొక్కేస్తూ భారీగా ఆస్తులు వెనకేసుకుంది. దీంతో ప్రజలు ఆమెకు బదులు భానుకు బటన్ నొక్కి అధికారం కట్టపెట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది. చూద్దామన్నా కనిపించడం లేదు. ఇదే సందర్భంలో ఆమె వైసీపీ కి రాజీనామా చేయబోతోందని..అందుకే ట్విట్టర్ లో వైసీపీ సింబల్ తీసేసిందని, త్వరలోనే తమిళనాడులో నటుడు విజయ్‌ పెట్టిన పార్టీలో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం అవ్వడం మొదలయ్యాయి. ఈ ప్రచారం చూసిన రాష్ట్ర ప్రజలంతా నిజమే అనుకుంటూ వస్తున్నారు. ఈ ప్రచారం ఫై తాజాగా రోజా స్పందించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అదంతా ఊహగానమే అని రోజా స్పష్టం చేసారు. తాను ఏ పార్టీ మారడం లేదని, పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని , ఎంతమంది పార్టీ వీడినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ఇదే సందర్బంగా కూటమి సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఘటనల పట్ల కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని రోజా విమర్శించారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని రోజా అన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో 60 రోజులు అవుతున్నా ఆ పాప శవాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారని విమర్శించారు. కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ అనడం దురదృష్టకరమని అన్నారు.

Read Also : Chandrababu September 1st : రేపు చంద్రబాబుకు ఎంతో ప్రత్యేకం ..