Site icon HashtagU Telugu

EX Minister RK Roja : జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే రోజా

Roja Meets Jagan

Roja Meets Jagan

నగరి లో ఘోర పరాజయం తర్వాత మొదటిసారి వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) ను రోజా (EX Minister RK Roja) కలిశారు. బుధువారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో ఈరోజు ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు జగన్ ను కలిసి పలు విషయాలపై చర్చలు జరిపారు. వీరిలో రోజా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి, అనంతరం పరిణామాలను వారు జగన్ వివరించినట్లు సమాచారం. నేతలు ఎవరూ అధైర్య పడొద్దని ఈ సందర్భంగా జగన్ సూచించినట్లు తెలుస్తుంది. నగరిలో సొంత పార్టీ నేతలే తన ఓటమికి ప్రయత్నించారని జగన్ కు రోజా ఫిర్యాదు చేసినట్లు వినికిడి. ఎన్నికల సమయంలోనూ రోజా ఈ విషయంపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాజాగా జగన్ కు ఈ విషయాన్ని వివరించినట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అలాగే రుషికొండ ప్యాలెస్ ఫై టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా రోజా జగన్ కు వివరించినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు రోజా తన ట్విట్టర్ వేదికగా రుషికొండ ప్యాలెస్ విషయంలో టీడీపీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్ని‍ంచారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు.

2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం…ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా…?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా…

హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా…ఈరోజు విమర్శలు చేసేది..?.

లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు…వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ కాస్త ఘాటుగా రోజా ట్వీట్ చేశారు. ఇక రోజా ట్వీట్ కు టీడీపీ నుండి కూడా అదే స్థాయిలో ఘాటైన కౌంటర్లే వస్తున్నాయి.

Read Also : IAS Transfers in AP : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..