Site icon HashtagU Telugu

CM Chandrababu : అనేక మంది ప్రధానులు వచ్చినా…ప్రపంచంలో భారత దేశాన్ని బ్రాండ్ చేసింది మోడీనే: సీఎం చంద్రబాబు

NDA CMs Council meeting

NDA CMs Council meeting

NDA CMs Council meeting: వికసిత్ భారత్ 2047 అనే అంశం ప్రధాన అజెండాగా  చండీగఢ్‌లో ఎన్డిఎ సిఎం సమావేశం సాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాలు, ఆలోచనలు వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి, సూచనలు, ప్రతిపాదనలను అభినందించిన ఇతర రాష్ట్ర సిఎంలు, ప్రధాని మోడీ. అయితే ప్రధాని మోడీ ప్రతి ఎన్నికా గెలవడం అలవాటుగా చేసుకున్నారు.. అంటూ సరదాగా వ్యాఖ్యానించారు చంద్రబాబు. ధృడమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్ పాలిటిక్స్, ప్రత్యేక ఆకర్షణ, కమ్యునికేషన్ ఆయనను సక్సెస్ గా మారుస్తున్నాయని సిఎం అన్నారు. అనేక మంది ప్రధానులు వచ్చినా….ప్రపంచంలో భారత దేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోడీనే అంటూ ప్రశంసించారు.. చంద్రబాబు. తమ ప్రసంగాల్లో చంద్రబాబు సూచించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన మోడీ.. వాజపేయి హయాంలో గతంలో కాశ్మీర్ లో జరిగిన ఎన్డిఎ మీటింగ్ ఘటనను గుర్తు చేసుకున్న మోడీ. మా రాష్ట్రాల్లో సంస్కరణలకు మేం సిద్దంగా ఉన్నామని నాడు కాశ్మీర్ లో జరిగిన ఎన్డిఎ మీటింగ్ లో తాను, చంద్రబాబు ప్రధాని వాజ్ పేయికి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని మోడీ. సంస్కరణలో పేదలకు లబ్దిజరుగతుందని….అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరగుతాయని నాడు తాము చెప్పామన్నారు మోడీ.

ఆత్మనిర్బర్ భారత్, జీరో పావర్టీ, మౌళిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుత్ ఉత్పత్తి, నైపుణ్యం, మానవవనరులు, నదుల అనుసంధానం, జనాభా నిర్వహణ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ వంటి అంశాల్లో తన అభిప్రాయాల చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోడీ గారి డైనమిక్ నాయకత్వంతో భారతదేశాన్ని , భారతీయులను ప్రపంచ వేదికపై ముందుకు నడిపిస్తూ ఆయన ప్రపంచ నాయకుడిగా ఎదిగారు.. గత 10 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి చేస్తున్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో దేశం ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతోంది. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్యక్రమాలతో భారతదేశాన్ని ప్రపంచంలో రెండవ లేదా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి మోడీ ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఇది ప్రజల ఆకాంక్షలు, ప్రజలతో అనుబంధంపై మోడీ జి ముద్రను తెలియజేస్తుంది..అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Lovers Suicide: గుంటూరులో దారుణం.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య