Site icon HashtagU Telugu

Davos : సీఐఐ కేంద్రం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Establishment of CII Center in Amaravati with Tata Company: CM Chandrababu

Establishment of CII Center in Amaravati with Tata Company: CM Chandrababu t Of Cii Center

Davos : ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం దావోస్‌ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఐఐ కేంద్రం ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. టాటా సంస్థతో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని ట్వీట్‌లో వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు. ఈ గ్లోబల్ లీడర్‌షిప్ ఆన్ కాంపిటీటివ్ నెస్ ద్వారా అంతర్జాతీయ, భారతీయ సంస్థల సహకారంతో ట్రాన్స్‌ఫర్మేటివ్ ఎడ్యుకేషన్, అధునాతన నైపుణ్యాలు, కెపాసిటీ బిల్డింగ్ అందిస్తామన్నారు. ట్రైనింగ్, అడ్వైజరీ సర్వీసుల ద్వారా ఇండస్ట్రియల్ కాంపిటీటివ్‌నెస్ మీద దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

సీఐఐ సెంటర్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించటంతో పాటుగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి తోడ్పాటును అందిస్తుందటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ తీసుకురావాలనేది నా లక్ష్యం. అలా తీసుకొస్తే.. చాలా మంది ఉద్యోగాలు చేసుకొని తమ పిల్లలను చూసుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పోటీ రంగాల్లో రాణించాలంటే ఏఐని ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. గతంలో ఐటీ నేర్చుకుంటే మంచి ప్యూచర్ ఉంటుందని ముందే చెప్పాను. నేర్చుకున్న వారు విదేశాల్లో స్థిరపడ్డారు. నేర్చుకోని వారు స్వదేశంలోనే ఉన్నారు.

2030 నాటికి దేశం నిర్దేశించుకున్న లక్ష్యంలో 30 శాతం అంటే.. 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు వివరించారు. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రపంచస్థాయి కంపెనీలకు ఏపీని గమ్యస్థానంగా మార్చనున్నట్లు చంద్రబాబు వివరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో గ్లోబల్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకోబోతున్న ప్రణాళికలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29 అనేది పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ అంశాలను ఏకీకృతం చేయడంతో పాటుగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన నైపుణ్యాలను అందించే ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌గా చంద్రబాబు అభివర్ణించారు.

Read Also: Amitabh Bachchan : డూప్లెక్స్ అపార్ట్మెంట్ ను అమ్మేసిన బిగ్ బి