Entrepreneurs : ఎంత చదివినా.. నైపుణ్యం ఉంటేనే జాబ్ వస్తుంది. ప్రశ్నజవాబులను బట్టీ పడితే ఉద్యోగం రాదు. వాటితో పాటు కావాల్సింది ప్రాక్టికల్ స్కిల్. దీన్ని అందించే వారిని యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా ఇకపై నియమించుకోవచ్చు. ఈమేరకు ప్రొఫెసర్ల నియామక నిబంధనల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్పులు చేయనుంది. ఒకవేళ యూజీసీ నిబంధనలు మారితే ఆంధ్రప్రదేశ్‌లోని నియామక ప్రక్రియలోనూ ఆమేరకు మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్, ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ వంటి రంగాల్లో నిపుణులై, పీజీ చేసిన వారిని నేరుగా వర్సిటీ అధ్యాపకుడిగా నియమించుకునేందుకు యూజీసీ వీలు కల్పించబోతోంది. అదే జరిగితే.. ఏపీ వర్సిటీల్లోనూ(Entrepreneurs) ఇలాంటి వారికి అధ్యాపకులుగా అవకాశం కల్పిస్తారు.
Also Read :Brazil : బ్రెజిల్ సుప్రీంకోర్టుపై సూసైడ్ ఎటాక్.. భారీ పేలుళ్లు.. ఒకరు మృతి
పరిశ్రమలతో సంబంధమున్న వారిని యూనివర్సిటీల్లో లెక్చరర్లుగా నియమించుకోవాలనే ప్రతిపాదనపై యూజీసీ దాదాపు ఆరేడు నెలల పాటు అధ్యయనం చేసింది. సమగ్ర అధ్యయనం తర్వాత దీనికి సంబంధించిన ముసాయిదాను రెడీ చేసింది. త్వరలోనే దీనిపై యూజీసీ అభిప్రాయాలు, సూచనలను సేకరించనుంది. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా, జాబ్ స్కిల్స్‌ను పెంపొందించేలా బోధన ఉండాలని.. అందుకోసమే పరిశ్రమలతో సంబంధమున్న వారిని అధ్యాపకులుగా తీసుకోవాలని యోచిస్తున్నారు. సాధారణంగానైతే పీజీతో పాటు పీహెచ్‌డీ చేసిన వారినే వర్సిటీల్లో అధ్యాపకులుగా నియమిస్తున్నారు. పరిశ్రమలతో సంబంధమున్న నిపుణులకు పీహెచ్‌డీ లేకున్నా.. కేవలం పీజీ ఉంటే అధ్యాపకులుగా అవకాశాన్ని కల్పిస్తారు.
Also Read :Meenaakshi Chaudhary : సంవత్సరంలో ఆరు సినిమాలు.. నెల గ్యాప్ లో మూడు సినిమాలు.. దూసుకుపోతున్న మీనాక్షి..
ఏపీ వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్
రాష్ట్రంలోని యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను రద్దు చేయాలని టీడీపీ సర్కారు యోచిస్తోంది. వాటి స్థానంలో బోర్డు ఆఫ్ గవర్నర్స్‌ను నియమించాలని అనుకుంటోంది. ఇందులో పారిశ్రామికవేత్తలు ఛైర్మన్లుగా ఉంటారు. ఈమేరకు ఏపీ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ హయాంలో రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యా వ్యవస్థ విప్లవాత్మక మార్పులను చూడబోతోంది.