Site icon HashtagU Telugu

Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

A check on the corrupt.. New bill with the support of Prime Minister Modi.. Strong response to the opposition's protest.

A check on the corrupt.. New bill with the support of Prime Minister Modi.. Strong response to the opposition's protest.

కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ రంగంలో కర్నూలు జిల్లా దేశానికి గర్వకారణంగా మారబోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇక్కడ ఏర్పాటు అవుతున్న ఆధునిక డ్రోన్ తయారీ యూనిట్లు, రక్షణ రంగానికి మాత్రమే కాకుండా వ్యవసాయం, పారిశ్రామిక, వైద్య రంగాలకు కూడా కొత్త అవకాశాలు తెరుస్తాయని ఆయన వివరించారు. ‘మెక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా కర్నూలును సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కర్నూలు డ్రోన్ సిటీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

రాయలసీమ అభివృద్ధి దిశగా కేంద్రం తీసుకున్న చర్యలను వివరించిన ఆయన, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని అన్నారు. గతంలో రాయలసీమను నిర్లక్ష్యం చేసిన పాలనలతో పోలిస్తే, ఇప్పుడు పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. ఈ కారిడార్లు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తాయని, సమీప జిల్లాల మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. ఆయన మాటల్లో, “రాయలసీమను వెనుకబాటుగా కాదు, పరిశ్రమల కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది” అని అన్నారు.

అదనంగా గతంలో కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రధాని విమర్శించారు. “అప్పుడు విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామం 24 గంటల కరెంట్ సౌకర్యం పొందుతోంది,” అని మోదీ చెప్పారు. ఈ మార్పు భారతదేశ అభివృద్ధి దిశగా సామాన్య ప్రజల జీవితంలో వచ్చిన నాణ్యతా మార్పుకు సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూలు వేదికగా మాట్లాడుతూ, “దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్‌కే ఉంది” అని మోదీ స్పష్టం చేశారు. ఆయన సందేశం, సాంకేతికత, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయంతోనే కొత్త భారత్ నిర్మాణం సాధ్యమని ప్రతిబింబించింది.

Exit mobile version