Employees : ఉద్యోగుల కోర్కెల‌కు జ‌గ‌న్ క‌ళ్లెం.!

ఏపీ ఉద్యోగులు (Employees) మూడో విడ‌త ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్నారు. తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - April 29, 2023 / 12:26 PM IST

ఏపీ ఉద్యోగులు (Employees) మూడో విడ‌త ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇక తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి వేస్తామ‌ని చెప్పిన పీఆర్సీ సంగ‌తి ఏమిటి? అంటూ ఉద్యోగ సంఘాల నేత‌లు నిల‌దీస్తున్నారు. ఇక సీపీఎస్ (CPS) ర‌ద్దు అట‌కెక్కింద‌ని ఉద్యోగులు నిర్థారించుకున్నారు. జీపీఎస్ మీద చ‌ర్చ‌ల‌కు సిద్ధం కావాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. దానికి ప‌రోక్షంగా సానుకూల‌త‌ను కొన్ని ఉద్యోగ సంఘాల నేత‌లు ఉన్నారు. మినిట్స్ అయిన 16 డిమాండ్ల సాధ‌న కోసం మూడో విడ‌త ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ఈనెల 29వ తేదీ ప్ర‌క‌టించ‌డానికి ఏపీ జేఏసీ ముహూర్తం పెట్టుకుంది.

ఏపీ ఉద్యోగులు  మూడో విడ‌త ఉద్య‌మానికి(Employees)  

రాష్ట్ర బ‌డ్జెట్ లో 70శాతంపైగా ఉద్యోగుల(Employees) జీతాలు, పెన్ష‌న్లు, వాళ్ల ఆరోగ్య సంర‌క్ష‌ణ త‌దిత‌రాల‌కు వెళుతోంది. ఆ విష‌యాన్ని ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ప‌దేప‌దే చెబుతున్నారు. సుమారు 90వేల కోట్ల‌కు పైగా ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కు స‌రిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ లెక్క త‌ప్పంటూ ఏపీ జేఏసీ అమ‌రావ‌తిలో(Amaravathi) ఏర్పాటు చేసుకున్న రౌండ్ టేబుల్ స‌మావేశంలో నిర్థారించారు. ఉద్యోగుల జీతాల‌పై ప్ర‌జ‌ల్లో అపోహ‌ల‌ను క్రియేట్ చేస్తున్నార‌ని చెబుతూ రాబోవు రోజుల్లో గ్రామ‌, వార్డు ఉద్యోగుల‌తో క‌లిసి ఉద్య‌మిస్తామ‌ని ఉద్యోగుల సంఘం నేత బొప్ప‌రాజు ప్ర‌క‌టించారు. అంతేకాదు, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ పై పోరాడుతోన్న వాళ్ల‌కు మ‌ద్ధ‌తు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. రాబోవు రోజుల్లో కార్మిక సంఘాల‌తో క‌లిసి ఉమ్మ‌డి ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్టు వెల్లడించారు.

కార్మిక సంఘాల‌తో క‌లిసి ఉమ్మ‌డి ఉద్య‌మానికి

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan mohan Reddy) ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగుల వాల‌కాన్ని తెలుసుకుంటున్నారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఉద్యోగుల(Employees) డిమాండ్ల‌ను చాక‌చ‌క్యంగా వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే జీతాలు పెనుభారంగా ప్ర‌భుత్వానికి మారింది. ప్ర‌తి నెలా జీతాలు వేయ‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ఉంది. అయిన‌ప్ప‌టికీ పీఆర్సీ వేయాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ పెడుతున్నారు. అంతేకాదు, సుమారు 70 డిమాండ్ల వ‌ర‌కు ప్ర‌భుత్వం ముందు ఉంచారు. వాటిలో క‌నీసం 16 డిమాండ్ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించాల‌ని వాళ్లు కోరుతున్నారు. ప్ర‌తి సమ‌స్య ఆర్థిక అంశంతో మూడిప‌డి ఉంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప‌రిస్థితిలో లేదని తెలుస్తోంది.

జీవోల‌ను మే ఒక‌టో తేదీ నుంచి  వెల్ల‌డిస్తామ‌ని మంత్రి బొత్సా స‌త్యానారాయ‌ణ

గ‌త ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన‌ సీపీఎస్(CPS) ర‌ద్దు హామీ అమ‌లు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా రెండేళ్ల క్రితం ఉద్య‌మించారు. అనూహ్యంగా విజ‌య‌వాడ‌కు పెద్ద ఎత్తున ఉద్యోగులు(Employees) త‌ర‌లిరావ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలిసారిగా అప్ప‌ట్లో షాక్ తిన్నారు. నిఘా వైఫ‌ల్యాన్ని గ‌మ‌నించిన ఆయ‌న ఆరోజు ఉన్న డీజీపీ స‌వాంగ్ ను మార్చేశారు. ఆ త‌రువాత డీజీపీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగుల క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఉద్య‌మానికి కాలుదువ్వే వాళ్ల‌ను ప‌లు మార్గాల ద్వారా కట్ట‌డీ చేస్తున్నారు. ఫ‌లితంగా ఏడాది కాలంగా మిలియ‌న్ మార్చ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వైఫ‌ల్యం చెందుతున్నాయి.

Also Read : Jagan : అవినాష్ రెడ్డికి చెక్, తెర‌పైకి జ‌గ‌న్ మ‌రో బ్ర‌ద‌ర్

ప్ర‌స్తుత రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా కొన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. వాటికి సంబంధించిన జీవోల‌ను మే ఒక‌టో తేదీ నుంచి వ‌రుస‌గా వెల్ల‌డిస్తామ‌ని మంత్రి బొత్సా స‌త్యానారాయ‌ణ హామీ ఇచ్చారు. వాటిలో సీపీఎస్ (CPS) మాత్రం ఉండ‌ద‌ని తేల్చేశారు. ఇక పీఆర్సీ విష‌యంపై చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అయితే, ఈనెల 29వ తేదీన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని ఉద్యోగ (Employees)సంఘాల జేఏసీ ప్ర‌క‌టించింది. ఆ నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అనేది చూడాలి.

Also Read : Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!