విద్యుత్తు అధికారి తన విధులను మరచిపోయి..కామంతో సబ్‌స్టేషన్‌లోనే మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. మిట్ట మధ్యాహ్నం..చుట్టూ స్థానికులు తిరుగుతున్నారనేది కూడా మరచిపోయి..శృంగారంలో మునిగిపోయాడు..ఇది చూసిన స్థానికులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అతడ్ని ఉద్యోగం లోనుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
గంగు మహేశ్వర రెడ్డి అనే వ్యక్తి పర్రెడ్డిగూడెంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కరెంట్ పోవడంతో ఉక్కపోతను భరించలేక సబ్‌స్టేషన్‌కు గ్రామస్థులు ఫోన్ చేశారు. అయినా, ఎలాంటి స్పందన లేకపోవడంతో అంతా కలిసి సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. అక్కడి వెళ్లిన స్థానికులు అక్కడ జరుగుతున్న బాగోతం చూసి షాక్ అయ్యాడు. డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర రెడ్డి తప్పతాగి ఓ మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. అది చూసిన గ్రామస్థులు ఆఫీసులో ఏంట పనులు అంటూ నిలదీశారు. ఇలాంటి ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు.
Read Also : T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ తడాఖా