Site icon HashtagU Telugu

AP Volunteer : ఏలూరు జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వాలంటీర్‌

Volunteer

Volunteer

ఏపీలో వాలంటీర్‌ (AP Volunteer)ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. అధికారం అడ్డు పెట్టుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా వాటిపై ఏమాత్రం ప్రభుత్వం (YCP Govt) కానీ పోలీసులు కానీ దృష్టి సారించడం లేదు. కఠినమైన శిక్షలు విధించడం కానీ , అరెస్ట్ లు చేయడం కానీ చేయకపోయేసరికి మరింతగా రెచ్చిపోతున్నారు. ఆధార్ పరిశీలన , ఓటర్ కార్డు పరిశీలన ఇలా ఏదో ఒకటి చెపుతూ ఇళ్లలోకి వెళ్లి యువతులను ప్రేమ పేరుతో లోబర్చుకోవడం , వివాహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఏలూరు జిల్లా (eluru district)లో ఓ యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్‌. ఈ విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించారు. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని చెప్పిన గణేష్‌.. తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీరా గర్భవతి అయ్యాక.. పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలవరం పోలీసులను ఆశ్రయించింది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, వాలంటీర్‌ వ్యవస్థపై ఓవైపు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

Read Also : Pawan Kalyan : కుటుంబం తో కలిసి ఇటలీకి పయనమైన పవన్ కళ్యాణ్