ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన “ఆడుదాం ఆంధ్రా” (Adudam Andhra) టోర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) ముఖ్య అతిధిగా హాజరై..విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ పోటీలో విజేతగా ఏలూరు (Eluru) జట్టు నిలిచింది. ఫైనల్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
We’re now on WhatsApp. Click to Join.
50 రోజుల పాటు జరిగిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారని CM జగన్ అన్నారు. ‘గ్రామ, వార్డు స్థాయిలో 3.30 లక్షల పోటీలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్లు జరిగాయి. ఇకపై ప్రతి ఏటా ఈ పోటీలు జరుగుతాయి. మన పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం’ అని జగన్ పేర్కొన్నారు.
గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించాం అని , రూ.12.21 కోట్ల నగదు బహుమతులు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. మట్టిలోని మాణిక్యాలకు మంచి శిక్షణ ఇస్తే వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అని జగన్ తెలిపారు. అలాగే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్లో ప్రతిభ చూపిన 14 మందిని గుర్తించామని , మన పిల్లలను క్రీడాంశాల వారీగా చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ప్రొ-కబడ్డీ, బ్లాక్ హాక్స్, ఏపీ కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అసోసియేషన్లు దత్తత తీసుకున్నాయని తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Also : Mammootty: అంచనాలు పెంచుతున్న మమ్ముట్టి ‘భ్రమయుగం’ మూవీ, విడుదలపై కీలక అప్డేట్