Raghu Rama: ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలిః రఘురామ

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 05:03 PM IST

 

Raghu Rama Krishna Raju: ఏపీలో అందరి దృష్టి ఎన్నికల (Election)పై ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ప్రకటన కోసం ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ నెల 15 లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఆ మేరకు సమాచారం ఉందని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 25-మే 5 మధ్య ఉండొచ్చని ఒక అంచనా అని వివరించారు. ఏపీలో ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో, ప్యాలెస్ ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని రఘురామ పిలుపునిచ్చారు.

read also : CEC Rajiv Kumar: ఎన్నికల వేళ హింసను నిరోధించేందుకు సీ విజిల్‌ పేరుతో అప్లికేషన్‌

“పోలవరం ఆపేస్తావా? అమరావతిలో రోడ్లు తవ్వేస్తావా? నువ్వేమో రూ.500 కోట్లతో కొంప కట్టుకుంటావా? ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా! పోలవరం ఆగిపోయింది… ప్రాజెక్టు నిర్మాణాలు అక్కడక్కడా కూలిపోయాయి. అమరావతి మొత్తం ఆగిపోయింది… జగన్ మనసు దోచిన స్థానిక ప్రతినిధి ఒకడున్నాడు అక్కడ… వాడు రోడ్లు తవ్వుకుపోతాడు. కంకరకు కంకరగా, మట్టికి మట్టిగా, రాళ్లకు రాళ్లుగా… దేనికి అదే సెపరేటుగా అమ్ముకుంటుంటాడు. ఈయన మాత్రం రూ.500 కోట్లతో కొంప కట్టుకుంటాడు. మనకు ప్రాజెక్టులు కట్టేవాడు కావాలా… లేక సొంతంగా ఉండడానికి ప్యాలెస్ లు కట్టుకునేవాడు కావాలా? ప్రజలారా ఆలోచించండి” అని రఘురామ పిలుపునిచ్చారు.