CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా పేరున్న నేత. ఆయన పాలనా విధానాలు యావత్ దేశంలో ఫేమస్. చంద్రబాబు పొలిటికల్ చరిష్మా గురించి బీజేపీకి బాగా తెలుసు. అందుకే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయమని చంద్రబాబును బీజేపీ పెద్దలు ఆహ్వానించారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ కూడా చంద్రబాబును ఆహ్వానించింది. వారి ఆహ్వానానికి ఓకే చెప్పిన చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Also Read :Suicide Letters : బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి సూసైడ్ లెటర్స్.. సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఏముందంటే..
చంద్రబాబు పర్యటన షెడ్యూల్
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు పయనం అవుతారు. ఈరోజు సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీ నగరంలోని 1 జన్‌పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని షహ్‌దారా ప్రాంతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం దేశ ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. ఏపీలోని ఎన్‌డీఏ కూటమి సర్కారు అమలు చేస్తున్న జనరంజక పథకాల గురించి చంద్రబాబు చెబుతారు. టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో తెలుగువారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని ఇటీవలే చంద్రబాబు సూచించారు.
Also Read :MLAs Secret Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై రాద్ధాంతం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ?
తెలంగాణ సీఎం రేవంత్ సైతం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2013 సంవత్సరం నుంచి ఢిల్లీలో ఆప్ వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆప్‌కు టఫ్ ఫైట్ ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా శాయశక్తులూ ఒడ్డుతోంది. ఎలాగైనా ఈసారి మెరుగైన ఫలితాలను సాధించాలనే పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు.