ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీపేరు తెరమీదకు వచ్చింది. లిక్కర్ స్కాం కింగ్‌పిన్ రాజ్ కసిరెడ్డితో కేశినేని చిన్నికి సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీ నోటీసులు జారీ చేయడం టీడీపీ లో చర్చ జరుగుతుంది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీతో రాజ్ కసిరెడ్డి ఉన్న లింకులపై ఈడీ ఆరా తీస్తుంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానిస్తుంది.
ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయని.. లిక్కర్ స్కాంపై కాదన్నారు. రాజ్ కెసిరెడ్డితో వ్యాపార సంబంధాలున్న ప్రతి ఒక్కరికీ ఈడీ నోటీసులు అందాయని… తాను, రాజ్ కెసిరెడ్డి కలసి ఓ సైట్ డెవలప్ చేద్దామనుకున్నామని తెలిపారు. 2020-21 మధ్య సైట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా రూ.35 లక్షల లావాదేవీలు జరిగాయని. రాజ్ కెసిరెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. ఈడీ నోటీసులకు సమాధానం ఇస్తామని .. తాము తప్పు చేయలేదన్నారు.
