Site icon HashtagU Telugu

Volunteers: జగన్ కు ఈసీ చెక్, వాలంటీర్ల కట్టడీ కి ఈసీ ఆదేశం

Jagan Cabinet 3.0

Ec Check To Jagan, Ec Order To Kattadi Of Volunteers

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు చెక్ పడింది. వాలంటీర్ల (Volunteers) ఎన్నికల జోక్యం పై సీరియస్ అయింది. ఇప్పటికే వాలంటీర్ల ఇష్యూ న్యాయ స్థానాలకు వెళ్ళింది. వాళ్ళ జోక్యం పలు ఆరోపణలను ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నఫిర్యాదులు వెల్లువ ఈసీని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఆ మేరకు వారిని కట్టడి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జిల్లా కలెక్టర్లకు మరోసారి లేఖలు రాశారు. వాలంటీర్లను (Volunteers) ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారిని కోరారు. గతంలో ఇలాంటి ఆదేశాలే ఇచ్చామని, కానీ అమలు కాకపోవడంతో మరోసారి ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు కలెక్టర్లకు మీనా తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లకు ఈసీ ఇచ్చిన ఆదేశాలు హిట్ టాపిక్ అయింది.ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాలంటీర్ల పాత్రపై విమర్శలూ పెరుగుతున్నాయి. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లను ఏడాది పొడవునా చెప్పుచేతల్లో ఉంచుకుంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే వారిని తొలగిస్తుండటంతో వాలంటీర్లు కూడా ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లా మారిపోతున్నారు.

తాజాగా ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి వాలంటీర్ల (Volunteers) పనితీరుపై విమర్శలకు వేదికవుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన దాదాపు మూడు లక్షల మంది గ్రామ,వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా పదే పదే ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నాయి. అయితే క్షేత్రస్ధాయిలో వాటిని అమలు చేయాల్సిన కలెక్టర్లు, డీపీవోలు, ఇతర అధికారులు మాత్రం వాలంటీర్లను కట్టడి చేసేందుకు భయపడుతున్నారు. దీంతో వాలంటీర్లపై మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తగిన ఆధారాలతో విపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది. కానీ , క్షేత్ర స్థాయి యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా బుట్టదాఖలు చేస్తున్నారు. ఈ సరైన వాలంటీర్ల ప్రమేయం ఎన్నికల మీద లేకుండా చేస్తారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

Also Read:  Pawan Kalyan: జగన్ పై మారిన పవన్ మనసు, విశాఖ సదస్సుపై ట్వీట్ దుమారం

Exit mobile version