EC Big Shock To Sajjala : సజ్జల కు భారీ షాక్ ఇచ్చిన ఈసీ

సోషల్ మీడియా వేదికగా ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తోందంటూ ఈసీకి వర్ల రామయ్య పిర్యాదు చేసారు

Published By: HashtagU Telugu Desk
Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎక్కడ తగ్గడం లేదు..అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా వరుస షాకుల మీద షాకులు ఇస్తుంది. ఎన్నికల నిబంధనలను ఎవరు పాటించకపోయిన వారికీ నోటీసులు జారీ చేస్తుంది. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా రథసారథి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

సోషల్ మీడియా వేదికగా ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తోందంటూ ఈసీకి వర్ల రామయ్య పిర్యాదు చేసారు. ఇలా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో ఆగ్రహం పెంచుతున్నారని..రామయ్య తన ఫిర్యాదులో పేర్కోవడం తో ఈసీ చర్యలకు దిగింది. వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ సీఐడీకి స్పష్టం చేసింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి నేడు ఆదేశాలు ఇచ్చింది.

Read Also : Ambati Rambabu : పవన్ కల్యాణే ..నా అల్లుడ్ని రెచ్చగొట్టింది – అంబటి రాంబాబు

  Last Updated: 05 May 2024, 08:42 PM IST