Site icon HashtagU Telugu

Tekkali : ఊపిరి పీల్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..బరిలో నుండి తప్పుకున్న దువ్వాడ వాణి

Duvvada Vani

Duvvada Vani

టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) కు భారీ ఊరట కలిగింది. వైసీపీ నుండి టెక్కలి అభ్యర్థి గా దువ్వాడ శ్రీనివాస్‌ ను అధిష్టానం (YCP) ప్రకటించింది. కానీ తనకే టికెట్ ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి (Duvvada Vani) అధిష్టానాన్ని కోరింది. కానీ అధిష్టానం ఇవ్వకపోయేసరికి వైసీపీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించింది. అంతే కాదు తన అనుచరులతో కలిసి ప్రచారం కూడా మొదలుపెట్టింది. దీంతో శ్రీనివాస్ కు ఇంటిపోరు తప్పేలా లేదని అంత మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధిష్టానం..ఆమెతో సంప్రదింపులు జరిపి..పోటీ నుండి తప్పుకునేలా చేసింది. దీంతో శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది. దీంతో టెక్కలి లో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. నిన్నటి వరకు ఎవరికీ మద్దతు తెలుపాలో..ఎవరి వెంట నడవాలో..? ఎవరికీ జై కొత్తలో అని అంత సందిగ్ధం లో ఉండగా..ఇప్పుడు వాణి తప్పుకోవడం తో అంత శ్రీనివాస్ వెంట నడిచేందుకు సిద్ధం అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

దువ్వాడ వాణిని గతేడాది మేలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నియోజకవర్గ ఇంఛార్జీలను మార్పు చేసింది. ఈ క్రమంలో దువ్వాడ వాణిని మార్చి దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు సీఎం జగన్. దీంతో తనను ఇంఛార్జీగా నియమించినా టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో దువ్వాడ వాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపునకు సహకరించాలని, ప్రచారంలో పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచించినా ఆమె అంగీకరించలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని..సోమవారం నామినేషన్ కూడా వేస్తానని ప్రకటించింది. కానీ ఇప్పుడు వెనకడుగు వేసి..భర్త విజయానికి అడుగులేస్తానని ప్రకటించింది. ప్రస్తుతం దువ్వాడ వాణి టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ హయాంలోనూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా పని చేశారు. 2004లో కాంగ్రెస్‌ తరఫున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు.

Read Also : Telangana : వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్…ఇకపై రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే..