Site icon HashtagU Telugu

Duvvada : హాట్ ప్రాపర్టీగా మారిన దువ్వాడ

Duvvada City

Duvvada City

విశాఖపట్నం (Vizag) ఈ నగరం ఎప్పుడు ప్రత్యేకమే. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్తులపై డిమాండ్ పెరుగుతోంది. అందులో ముఖ్యంగా దువ్వాడ (Duvvada ) ప్రాంతం తాజాగా హాట్ ప్రాపర్టీ హబ్ గా మారుతోంది. విశాఖపట్నం శివార్లలో చిన్న పట్టణంగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఇప్పుడు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందుతూ రియల్ ఎస్టేట్ (Real estate) రంగంలో ప్రధాన కేంద్రంగా మారుతోంది. సేవా రంగం విస్తరణ, అంతర్జాతీయ కంపెనీలు వస్తుండడం, మౌలిక సదుపాయాల పెరుగుదల దువ్వాడని మరింత ముఖ్యమైన పెట్టుబడి ప్రాంతంగా మార్చింది.

Madhabi Puri Buch : బాంబే హైకోర్టును ఆశ్రయించిన సెబీ మాజీ చీఫ్‌

దువ్వాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల విద్యా సంస్థలు, పరిశ్రమలు ఏర్పడడం ఇక్కడికి ఆకర్షణ పెరగడానికి ప్రధాన కారణం. విశాఖ సిటీతో అనుసంధానించే అద్భుతమైన రోడ్డు మార్గాలు, రైల్వే కనెక్షన్లు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను ఇస్తున్నాయి. పాత కాలంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగినప్పటికీ, గత పదేళ్లలో ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్లు, విల్లాల డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుండడం తో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా మారింది.

Hyderabad : హైదరాబాద్‌లో ఎన్ని అంతస్తుల వరకు నిర్మాణం జరుపుకోవచ్చు..?

ప్రస్తుతం దువ్వాడలో ఫ్లాట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అన్ని ఆధునిక సదుపాయాలు కలిగిన లగ్జరీ అపార్టుమెంట్లు కోటి రూపాయల వరకు పలుకుతున్నాయి. సాధారణంగా 2BHK ఫ్లాట్లు వెయ్యి స్క్వేర్ ఫీట్ ఉండగా, 50 లక్షల లోపే లభిస్తున్నాయి. అయితే కొంచెం అదనంగా పెట్టుబడి పెడితే త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖ నగరంలో ఆస్తులు కొనలేని వారికీ, కాస్త తక్కువ బడ్జెట్‌లో మంచి వసతులతో కూడిన ఇళ్లు కొనాలనుకునే వారికి దువ్వాడ ఉత్తమ ఎంపికగా మారుతోంది. దువ్వాడ ప్రస్తుతం వృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారడంతో, ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకునేవారు పెరిగిపోతున్నారు. కొత్తగా వచ్చే అంతర్జాతీయ సంస్థలు, మెట్రో కనెక్టివిటీ, రోడ్డు విస్తరణలు, భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందించనున్నాయి. రాబోయే 5-10 ఏళ్లలో దువ్వాడలో భూముల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.