తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో దసరా సంబరాలు అంబరాన్నంటేలా జరిగాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు భక్తి, ఆనందం మేళవింపుగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, శోభాయాత్రలు ఉత్సాహంగా సాగాయి. పలు ప్రాంతాల్లో రావణ దహనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పండుగ ఉత్సవాల్లో లేజర్ షో, ఫైర్ వర్క్స్, జానపద కళారూపాలు, బొమ్మల ఆటలు, హారతుల వేడుకలు ప్రజలను ముగ్ధులను చేశాయి. పండుగ వాతావరణం అన్ని వయసులవారిలో ఉత్సాహాన్ని నింపింది.
Green Chilie: ఏంటి.. పచ్చిమిర్చి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?
ప్రత్యేకంగా తెలంగాణలోని వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానం దసరా ఉత్సవాలకు వేదికగా మారింది. అక్కడ నిర్వహించిన భారీ స్థాయి వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పండుగ సందడి చూడటానికి వేలాది మంది కుటుంబాలతో తరలివచ్చారు. అద్భుతమైన రంగుల కాంతులు, లేజర్ ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, మ్యూజిక్ కచేరీలు కలగలిసి పండుగ వాతావరణాన్ని మిలమిలలాడేలా చేశాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొని పండుగను ఆహ్లాదకరంగా మార్చారు.
ఈ వేడుకలకు సంబంధించిన డ్రోన్ వీడియోను ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా** అది నిమిషాల్లో వైరల్ అయింది. వేడుకల దృశ్యాలు, రంగుల కాంతులు, జనసందడి చూసిన నెటిజన్లు గూస్‌బంప్స్ వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరంగల్ దసరా ఉత్సవాలు ఈసారి మరింత భిన్నంగా, భారీ స్థాయిలో నిర్వహించబడటంతో సోషల్ మీడియా అంతటా ఈ వేడుకలే చర్చనీయాంశంగా మారాయి. ఈ పండుగ సంబరాలు సంప్రదాయం, ఆధునికత కలబోసుకుని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి.
