Trains Cancelled : నవంబరు 5 వరకు ఈ ట్రైన్స్ రద్దు

Trains Cancelled : దక్షిణ మధ్య  రైల్వే డివిజన్ పరిధిలోని ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా ఈనెల 30 వరకు పలు రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు.

Published By: HashtagU Telugu Desk
General Ticket Rule

General Ticket Rule

Trains Cancelled : దక్షిణ మధ్య  రైల్వే డివిజన్ పరిధిలోని ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా ఈనెల 30 వరకు పలు రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు. అయితే దీనిపై ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ట్రాక్ మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని రోజుల పాటు ఈ రైళ్ల రద్దును పొడిగిస్తున్నామని దక్షిణ మధ్య  రైల్వే వెల్లడించింది.  విజయవాడ నుంచి ఖమ్మం రైల్వే రూట్‌లో నడిచే డోర్నకల్ – విజయవాడ, విజయవాడ- డోర్నకల్, భద్రాచాలం రోడ్డు -విజయవాడ రైళ్ల  రద్దును నవంబరు 5 వరకు పొడిగించారు.

We’re now on WhatsApp. Click to Join.

  • అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాజమండ్రి – విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ రైలును (07466), ఆయా తేదీల్లో తిరుగు ప్రయాణం అయ్యే రైలు (07467)ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
  • విశాఖ – విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడిచే డబుల్ డెక్కర్ (22701) రైలును అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణమయ్యే రైలు కూడా ఆయా తేదీల్లో అందుబాటులో ఉండదని పేర్కొన్నారు.
  • 26, 27, 28 తేదీల్లో.. విశాఖ – కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కొరాపుట్ నుంచి తిరిగి ప్రయాణం అవుతుందని, అలాగే హౌరా – జగ్దల్ పూర్ సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ టిట్లాగఢ్ నుంచి హౌరాకు తిరుగు ప్రయాణమవుతుందని వివరించారు. భువనేశ్వర్ – జగ్దల్ పూర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ (18447) కొరాపుట్ నుంచి తిరుగు ప్రయాణమై భువనేశ్వర్‌కు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
  • రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జి మూసివేతను నవంబరు 10 వరకు పొడిగించారు. గత నెల 27 నుంచి వంతెనపై ట్రాఫిక్ నిలిపేసి సుమారు రూ.2 కోట్ల నిధులతో మరమ్మతు పనులు(Trains Cancelled) చేపడుతున్నారు.

Also Read: Toor Dal – Ration Shops : ఏపీలో రూ.67కే కిలో కందిపప్పు.. జనవరి దాకా సప్లై

  Last Updated: 27 Oct 2023, 10:28 AM IST