DSP Krupakar : తిరుమలలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం

మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా 1,805 మెట్టు దగ్గర అస్వస్థతకు గురై.. గుండెలో నొప్పి రావడం

Published By: HashtagU Telugu Desk
Dsp Krupakar

Dsp Krupakar

ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (DSP Krupakar) (59) కన్నుమూశారు. ప్రధాని మోడీ (Modi) పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల (Tirumala) చేరుకున్నారు. మెట్ల దారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు. మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా 1,805 మెట్టు దగ్గర అస్వస్థతకు గురై.. గుండెలో నొప్పి రావడం తో కుప్పకూలారు. ఆస్పత్రి తరలించేలోపే ఆయన కన్నుమూశారు.

We’re now on WhatsApp. Click to Join.

కృపాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ దగ్గర్లోని పోరంకి. కృపాకర్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మోడీ (Prime Minister Narendra Modi) తిరుమల పర్యటన చూస్తే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ…. ఆదివారం సాయంత్రం 5:45నిమిషాలకు తిరుపతికి బయలుదేరనున్నారు. రాత్రి తిరుమలలో బస చేస్తారు. సోమవారం ఉదయాన్నే శ్రీవారిని దర్శనం చేసుకొని.. 1:30నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

Read Also : MLC Kavitha: ఎలక్షన్ ఎఫెక్ట్, ఛాయ్ హోటల్ లో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత

  Last Updated: 25 Nov 2023, 12:35 PM IST