Visakhapatnam: మద్యం మత్తులో మహిళ వీరంగం.. తప్పిన ప్రమాదం

మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది.

మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా డ్రంక్ డ్రైవ్ అనేది ప్రాణాల మీదకు కొనితెచ్చుకున్నట్టే. తాజాగా ఏపీలో ఓ మహిళ మద్యం సేవించి హల్చల్ చేసింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.

విశాఖపట్నంకు చెందిన మహిళ మద్యం సేవించి తన కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పార్క్ చేసిన 8 ద్విచక్ర వాహనాలపైకి ఎక్కించింది. దీనిపై పోలీసులు కేసు బుక్ చేసి విచారిస్తున్నారు. పోలీసు రామారావు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం అర్థరాత్రి విశాఖపట్నంలోని సోమా బార్ సమీపంలో వీఐపీ రోడ్డుపై ఆగి ఉన్న ఎనిమిది ద్విచక్ర వాహనాలను కారు అతివేగంతో ఢీకొట్టింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా.. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె అక్కడి నుంచి పారిపోయిందని స్థానికులు సమాచారం ఇచ్చారు.

Also Read: Koheda Market: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కోహెడ, రూ. 403 కోట్లతో నిర్మాణం