Site icon HashtagU Telugu

Drones : ఏపీలో మందుబాబులను పరిగెత్తిస్తున్న డ్రోన్లు

Drones Ap

Drones Ap

ఆరుబయట మద్యం తాగేవారికి (Drunkard) పోలీసులు (AP Police) చుక్కలు చూపిస్తున్నారు. ఒకప్పుడు జీపు వేసుకొని సైరన్ చేస్తూ వచ్చేవారు..దీంతో ఆ సౌండ్ విని మందుబాబులంతా అలర్ట్ అయ్యే వారు..కానీ ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) టెక్నలాజి మైండ్ తో పోలీసుల డ్రోన్లు (Drones ) మందుబాబులను పరిగెత్తిస్తున్నాయి. పొలాలు, కాలువ గట్లు, రైల్వే ట్రాక్ల వద్ద మద్యం తాగుతున్నవారిని వెంటాడుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై డ్రోన్లతో నిఘా పెడుతున్న పోలీసులు వారి జాడ కనుక్కొని కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో డ్రోన్ల ఉపయోగం బాగా పెరిగింది. కృష్ణ వరదల సమయంలో డ్రోన్ల పనితనం చూసిన చంద్రబాబు..రీసెంట్ గా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ (Drone Summit) ఏర్పటు చేయగా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. భవిష్యత్తు అంతా డ్రోన్ టెక్నాలజీదేనని, డ్రోన్లను ఉపయోగించి ఇన్విజిబుల్ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ఆట కట్టించవచ్చని సీఎం చంద్రబాబు ఆ సమ్మిట్ లో చెప్పారు. దానిని ఇప్పుడు ప్రకటికల్ గా వాడుతున్నారు. ప్రతి చోట డ్రోన్ లు ఎగురవేస్తూ..ఎక్కడ ఏంజరుగుతుందో చూస్తున్నారు.

రీసెంట్ గా డ్రోన్లను ఉపయోగించి వందల ఎకరాల గంజాయి పంటను పోలీసులు దగ్ధం చేసిన ఘటన తెలిసిందే. అదే తరహాలో తాజాగా అనంతపురం జిల్లాలో డ్రోన్లను ఉపయోగించి మందుబాబుల ఆటకట్టించారు పోలీసులు. పట్టపగలే బహిరంగ ప్రదేశాలలో మందేస్తున్న కొందరిని డ్రోన్లు కనిపెట్టాయి. ఇంకేముందు ఇప్పుడు డ్రోన్ కనిపిస్తే చాలు మందుబాబులు కాదు తప్పు చేస్తున్న వారు సైతం పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి పారిపోతున్నారు. పొలాలలో, కాలువ గట్ల మీద, రైల్వే ట్రాక్ ల సమీపంలో మందుబాబులను తాజాగా డ్రోన్లు పరిగెత్తించాయి. మందుబాబుల సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా కాకుండా డ్రోన్ల సాయంతో రంగంలోకి దిగారు. దీంతో, తమ ముఖం కనిపించకుండా తలా ఓ దిక్కుకు మందుబాబులు అక్కడి నుండి చెట్లు పొట్టలు దాటుకుంటూ పరుగులు పెడుతున్నారు. మద్యం తాగితే కిక్ ఏమో కానీ ఇలా పరుగులు పెట్టడంలో భలే కిక్ వస్తుందంటూ కొంతమంది మందు బాబులు ఫన్నీ గా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి టెక్నలాజి వాడకడంలో బాబు తర్వాతే అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Threat call against PM Modi : ప్రధాని మోదీని చంపేస్తానంటూ మహిళ బెదిరింపు