Donkey Running : అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు..ఇదేం వింత ఆచారం ..!!

అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు చేపడుతూ ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని కొనసాగుతున్నారు

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 07:16 PM IST

దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్నో సంప్రదాయాలు , కట్టుబాట్లు పాటిస్తుంటారు..అలాగే పలు ఆచారాలను కూడా పాటిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు చేపడుతూ ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని కొనసాగుతున్నారు. మాములుగా కోడి పందేలు , గుర్రుపు పందేలు ఎక్కువగా వింటుంటాం..కానీ ఇక్కడ మాత్రం గాడిదల పరుగు (Donkey Running) పందేలు నిర్వహిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా వజ్రకరూర్ (Vajrakarur )​లో శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భాంగా ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అంతే వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో గాడిదలకు పరుగు పందెం నిర్వహించడం ప్రత్యేకం. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని, వాటిని పరిగెత్తిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమన్నట్టుగా గాడిదలు పరుగులు తీస్తుంటాయి. ఈ పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరుగగా..ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పందేలను తిలకించారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం గాడిదల మీద వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ రన్నింగ్ పోటీ నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.

Read Also : Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు