Doctors Successfully Perform Brain Surgery : కాకినాడ జీజీహెచ్ (Kakinada GGH Hospital) న్యూరోసర్జరీ వైద్యులు (Neurosurgery Doctors) ఓ 55 ఏళ్ల మహిళకు సినిమా చూపిస్తూ అరుదైన ఆపరేషన్ (Operation) చేసి వార్తల్లో నిలిచారు. తక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం కామెడీ వీడియోలను ఫోన్లో చూపిస్తూ సర్జరీ (క్రానియోటమి) నిర్వహించారు. ఆమె మెదడులో ఎడమ వైపున ఉన్న ట్యూమర్ను (Tumor) తొలగించారు. సర్జరీ సక్సెస్ కావడంతో వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ప్రస్తుతం వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది..కళ్ల మార్పిడి దగ్గరి నుండి గుండె మార్పిడిల వరకు అనేక రకాల ఆపరేషన్లు చేస్తూ.. ఎంతో క్లిష్టమైన, అసాధ్యం అనుకునే ఆపరేషన్లను సైతం ఎంతో సులభంగా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో సినిమాలు చూపిస్తూ..రోగులకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అరుదైన ఆపరేషన్ కాకినాడ సర్వజన ఆస్పత్రిలో జరిగింది. అదుర్స్ సినిమా చూపిస్తూ… మెదడు ఆపరేషన్ చేసి అదుర్స్ అనిపించారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ. కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ.. ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా జీజీహెచ్ లో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడులో ఎడమవైపు కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇక మెదడులో ఉన్న కణితిని తొలగించాలంటే.. చాలా రిస్క్ తో కూడిన పని అని అందరికి తెలిసిందే. ఆపరేషన్ సమయంలో రోగి పొరపాటును కూడా నిద్రలోకి జారుకోకూడదు. దీంతో చాలా సమయం పాటు వైద్యులు శస్త్ర చికిత్స ఎలా చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఎవరు ఇష్టమంటే..జూ. ఎన్టీఆర్ అంటే ఇష్టమని తెలిసింది.
దీంతో వెంటనే కాకినాడ జీజీహెచ్ వైద్యులకు ఓ ఆలోచన వచ్చింది. రోగికి అదుర్స్ సినిమా చూపించాలనే భావించారు. ఈ క్రమంలోనే ఆమెకు ‘అదుర్స్’ మూవీని ట్యాబ్ లో చూస్తుండమని చెప్పి.. కణితిని తొలగించారు. మెదడుకు సర్జరీ చేసే సమయంలో ఆమెకు ట్యాబ్ లో అదుర్స్ (Adhurs) సినిమాను చూపిస్తూ శస్త్రచికిత్సను చేపట్టారు. ఆమె మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ ను విజయంతం చేసి.. రోగిని బతికించిన డాక్టర్స్ ఫై ఆమె బంధువులు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన డాక్టర్లు కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అదుర్స్ సినిమాని చూపిస్తూ "అవేక్ క్రానియోటమీ" ద్వారా మహిళా రోగికి బ్రెయిన్ ట్యూమర్ను తొలగించిన డాక్టర్లు. #NTR #adhurs #movie #Kakinada #doctor #HashtagU pic.twitter.com/OggjgncsnP
— Hashtag U (@HashtaguIn) September 18, 2024
Read Also ; Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ