వైస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడ్ని , ఒక్క అవకాశం ఇవ్వండి, జగన్ పాలనా ఎలా ఉంటుందో చూపిస్తా, ప్రజలకు అన్ని సమకూరుస్తా…ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి 2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం గా అఖండ మెజార్టీ తో విజయం సాధించారు. అధికారం చేపట్టిన తర్వాత తన పాలనా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించి..ఓట్లు వేసిన ప్రజలు తలలు పెట్టుకునేలా చేసాడు. రాష్ట్ర అభివృద్దని పక్కన పెట్టి స్వలాభం కోసం తనతో పాటు తన పార్టీ నేతలు ముందుకు వెళ్లారు. ఐదేళ్లలో ఎంత నాశనం చేయాలో అంత చేసారు. ఈ ఐదేళ్లలో జగన్ ఎంత ప్రజల సొమ్ము కాజేసాడో లెక్కలు బయటకు వస్తున్నాయి.
AP Economic Growth : ఆర్ధికంగా బలపడుతున్న ఏపీ..ఇది కదా బాబు మార్క్ అంటే !!
జగన్ తన అధికార కాలంలో ప్రజాధనాన్ని వ్యక్తిగత, పార్టీ అవసరాల కోసం విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు మొదటి నుండి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కేవలం అధికార విధులకు మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత ఆస్తులు, పార్టీ కార్యకలాపాల బాధ్యతలను కూడా ప్రజా సొమ్ముతోనే నెరవేర్చుకోవచ్చని ఆయన భావించినట్లు విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనికి కళ్ల ముందు కనిపించే ఉదాహరణగా తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉన్న ప్యాలెస్ నిర్మాణాన్ని ఉదహరిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తిని కూలగొట్టి, సుమారు రూ. 600 కోట్లు ఖర్చు చేసి ఆ ప్యాలెస్‌ను నిర్మించారని, ఈ లెక్కలు బహిరంగంగా కనిపిస్తున్నాయని, రికార్డుల్లో ఇంకా చాలా దుర్వినియోగం ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.
జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో రెండు ఎకరాల స్థలంలో రెండు ప్యాలెస్‌లు కట్టించుకున్నారు. ఒకటి క్యాంపు కార్యాలయం, మరొకటి నివాసం. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నివాసంలో ఇంటీరియర్ డెకరేషన్ నుంచి కిటికీలు, బయట యాభై అడుగుల ఎత్తులో నిర్మించిన ఇనుప కంచెల వరకు ప్రతీది ప్రజాధనంతోనే సమకూర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్యాలెస్ కోసం కనీసం వంద కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఉంటారని అంచనా. అంతేకాకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ట్విట్టర్ హ్యాండిల్‌ను కూడా పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల నియామకం, ఐ-ప్యాక్ సమావేశాల వివరాలను ప్రచారం చేయడానికి ఉపయోగించడం, బహిరంగ సభల ఏర్పాట్లకు ప్రజాధనాన్ని వాడటం వంటివి కూడా జరిగాయని తెలుస్తుంది.
