మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే కేవలం సినీ నటుడు..కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అంతే కాదు కింగ్ మేకర్..గేమ్ ఛేంజర్..ఇంకా ఎన్నో అంటున్నారు. పదేళ్లుగా రాజకీయాల్లో తన సత్తా చాటాలని కష్టపడుతూ, పనికిరాని వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటూ ఏసీ గదుల్లో ఉంటూ రోజుకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సత్తా ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి ఎండల్లో , వానల్లో ప్రజల కోసం తిరుగుతూ కష్టపడుతూ వచ్చాడు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజలకు పంచుతూ వచ్చాడు. ఇంతకాలం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించడమే కాదు ఈరోజు కూటమి విజయం సాధించిందంటే దానికి కర్మ , కర్త,క్రియ అన్ని కూడా పవన్ కల్యాణే. ఆయన మాత్రమే కాదు తన పార్టీ తరుపున బరిలోకి దిగిన 21 ఎమ్మెల్యే లను , ఇద్దరు ఎంపిలను కూడా గెలిపించి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ వస్తున్నారు. ఇక సినిమాల్లో రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన..ఇప్పుడు ఎమ్మెల్యే గా ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..? ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. నియోజకవర్గ అలవెన్స్లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే జీతంగా అందుకుంటారు. ఇక దేశంలోనే తెలంగాణ ఎమ్మెల్యేలు అత్యధిక (రూ.4 లక్షలు) జీతం అందుకుంటున్నారు. ఇక సినిమాల్లో రోజుకు రెండు కోట్లు తీసుకునే పవన్..ఇప్పటి నుండి ఎమ్మెల్యే గా నెలకు రూ.3.35 లక్షల జీతం తీసుకోబోతున్నాడు. మరి సినిమాలు చేస్తాడా..? అపెస్తాడా..? అనేది చూడాలి.
Read Also : Chandrababu : TDP క్యాడర్ సంయమనం పాటించాలి – చంద్రబాబు