New Pass Books : ఏపీపలో కొత్త పాసు పుస్తకాలపై రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో జరిగి.. వివిధ శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.
Read Also: Satyendra Das : అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
గత ప్రభుత్వ హయాంలో 8,680 గ్రామాల్లో రీసర్వే చేసి.. రైతులకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కు తీసుకుంటామన్నారు. ఈ పాత పాస్‌బుక్‌ల స్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలు ఉండటంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి సీఎం చంద్రబాబుకి వివరించారు. మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుందని తెలిపారు.
రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం కేంద్రం పరిశీలనలో ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడి యా వెల్లడించారు. కేంద్రం ఆ చట్టాన్ని త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు త్వర లో ఉత్తర్వులు జారీ చేస్తామని, ఇప్పటికే సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు ఇచ్చారని సిసోడియా వివరించారు.
Read Also: Vishwambhara : ‘విశ్వంభర’లో హైలైట్ సీన్ ఇదేనట..!!