Site icon HashtagU Telugu

Guntur TDP : నేడు గుంటూరులో ‘చంద్రన్న కానుక’ పంపిణీ

Distribution Of 'chandranna Kanuka' In Guntur Today TDP

Distribution Of 'chandranna Kanuka' In Guntur Today

తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరులో (Guntur) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకను అందిస్తారు. ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రతి సంక్రాంతికి ‘చంద్రన్న కానుక’ పేరుతో ప్రజలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసేది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకం ఆగిపోయింది. అయితే, అధికారంలో లేకున్నా పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో దీనిని తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

గుంటూరు (Guntur) సదాశివనగర్‌లో వికాస్ హాస్టల్ మైదానంలో నేడు 30 వేల మందికి సంక్రాంతి కానుకతోపాటు జనతా వస్త్రాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు చేరుకోనున్న చంద్రబాబు పేదలకు ఈ కానుకలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సభ ముగిశాక చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

Also Read:  Interview Dress Codes : ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్‌లను ధరించండి