Jagan- Bharati: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ (Jagan- Bharati) విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే వైసీపీకి ఊహించని భారీ షాక్‌లు ఎదురయ్యాయి. అందులో ముఖ్యంగా విజయసాయి రెడ్డి రాజీనామా. వైసీపీ రాజ్యసభ పదవికి, అదే విధంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేస్తూ మిగిలిన జీవితాన్ని గడిపేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తర్వాత అన్ని తానై వ్యవహారించిన విజయసాయి రెడ్డి ఇలా సడెన్‌గా రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా విజయసాయి రెడ్డి రాజీనామా, వైసీపీ పార్టీపై ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. A1 అయిన జగన్‌కు, A2 అయిన సాయిరెడ్డికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి తప్పించుకోలేని తప్పులు చేశారని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. వైసీపీ అడుగు దశకు చేరిందని, వైఎస్ఆర్ డైనోసార్ అని జగన్ సార్ బేకార్ అని ఎద్దేవా చేశారు. పులివెందులలో డీఎస్పీ మురళీ నాయక్‌ను జగన్ బెదిరించాడని అన్నారు.
Also Read: Unified Pension Scheme: బడ్జెట్‌కు ముందే కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!
విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగన్ లాంటి దరిద్రుడు నుంచి దూరంగా ఉండాలని, వైసీపీ లాంటి పార్టీ ఉండకూడదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేకా హత్యపై విజయసాయిరెడ్డి నిజం చెప్పారన్నారు. విజయసాయి రెడ్డితో అవినాష్ గుండెపోటు అని చెప్పించాడని ప్రభుత్వ విప్ ఆరోపించారు. జగన్ రెప్పకు దెబ్బతగిలితే హత్యా ప్రయత్నం… బాబాయికి గొడ్డలి పోట్లు ఉంటే గుండెపోటా? అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్‌కు ఆయన సతీమణి భారతికి మధ్య కూడా విభేదాలు ఉన్నాయని బాంబు పేల్చారు. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తుంటే అది తట్టుకోలేక విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని అన్నారు. జగన్ లండన్ నుంచి ఏపీ వచ్చేసరికి వైసీపీలోని అందరు లండన్ చేరడమేనని అన్నారు. విజయసాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ నేతలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. విజయసాయి రెడ్డి బాటలో చాలా మంది ఉన్నారని ఎమ్మెల్యే హింట్ కూడా ఇచ్చారు. వైసీపీకి కాలం చెల్లిపోయిందని ముగించారు.