Maoist Top Leaders : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడికి వెళ్లారు ? అనే కోణంలో ఇప్పుడు పోలీసు వర్గాలు అన్వేషణ చేస్తున్నాయి. 15 రోజుల క్రితమే మావోయిస్టు అగ్రనేతల టీమ్‌లు మూడుగా విడిపోయి కర్రెగుట్టల నుంచి వేర్వేరు మార్గాల్లో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఒక టీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామిడి వైపు వెళ్లిందని అంటున్నారు. ఇంకో టీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ వైపు వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. మరో టీమ్ ఏపీ- తెలంగాణ బార్డర్ వైపు వెళ్లిందని సమాచారం. ఏపీ- తెలంగాణ బార్డర్(Maoist Top Leaders) వైపున్న అడవుల్లోకి వెళ్లిన టీమ్‌లోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నాడనే అంచనాలు వెలువడుతున్నాయి. హిడ్మా వెంటే అతడి ప్రత్యేక గెరిల్లా టీమ్ ఉందట. అందులో దాదాపు 2వేల మంది సభ్యులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కర్రెగుట్టల్లోనే ఉన్నామంటూ తెలంగాణ పోలీసు బలగాలు, భద్రతా బలగాలను ఆలోచింపజేసి.. అకస్మాత్తుగా మావోయిస్టులు రూట్ మార్చారు. సేఫ్‌గా ఇతర్రతా ప్రాంతాలకు తరలిపోయారు.
Also Read :Operation Sandwich: పాకిస్తాన్ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్‌విచ్’ స్కెచ్!
ఏపీ ఏజెన్సీలో..
ఏపీ – తెలంగాణ బార్డర్‌లో ఇప్పుడు వేడి రాచుకుంది. నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులూ అలర్ట్ మోడ్‌లోకి వచ్చారు. సోమవారం రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు, వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దుల్లోని కాకులమామిడి గ్రామం వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు 15 మంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లారు. దీంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి ఆ అడవులను జల్లెడ పడుతున్నారు.
Also Read :India Vs Pakistan: 24 నుంచి 36 గంటల్లోగా భారత్ ఎటాక్ : పాకిస్తాన్
గాజర్ల రవి, జగన్‌లు..
సోమవారం రోజే మధ్యాహ్నం 2.30 గంటలకు కాంటవరం అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలకు మరోసారి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడి నుంచి కూడా తప్పించుకున్న మావోయిస్టులలో కీలకనేతలు గాజర్ల రవి, జగన్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పోలీసుల కాల్పుల్లో కొందరు మావోయిస్టులకు గాయాలు అయినందున.. వారు వెంటనే దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం లేదు. దీంతో ఆ అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.