‘ఢీ’ డ్యాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో పండు మాస్టర్‌ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఈవెంట్ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ పండు మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం దగ్గర కారు వెనుక నిలబడి ఉన్న పండు మాస్టర్‌ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి తగరపువసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలలో డ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి తిరిగి వస్తున్నారు.
మార్గ మధ్యలో పండు మాస్టర్ టీమ్‌లోని ఒక డ్యాన్సర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో రోడ్డుపక్కన కారు ఆపారు. వెంటనే పండు మాస్టర్ కారులో నుంచి కిందకు దిగి రోడ్డుపై నిలబడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ ఆయన్ను ఢీకొట్టింది. అది ఎదురుగా ఉన్న కారును కూడా ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, తోటి టీమ్ సభ్యుల సాయంతో ఆయన్ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలు ఉన్నాయా అనేది క్లారిటీ లేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. కారుతో పాటుగా ప్రమాదానికి కారణమైన కోళ్ల వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పండు మాస్టర్ ఢీ డ్యాన్ షోతో పాటుగా మరికొన్ని షోస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తన టీమ్‌తో కలిసి సొంతంగా కొన్ని డ్యాన్స్ షోస్ చేస్తున్నారు. మంగళవారం రోజు పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి విశాఖపట్నం తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ ఈవెంట్‌కు వెళ్లారు.. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
