Site icon HashtagU Telugu

AP : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది జగనే – ధర్మాన కృష్ణ దాస్

Dharmana Krishna Das

Dharmana Krishna Das

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది జగనే (Jagan) అని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ (Dharmana Krishna Das). రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) నేతలంతా ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ జిల్లాలో పర్యటిస్తూ..రాష్ట్రంలో అన్ని వర్గాలకు సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని , జగన్ ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేదు అని కృష్ణ దాస్ చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు జిల్లాలో అభివృద్ధినీ నిర్లక్ష్యం చేశాయి.. కానీ, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు అభివృద్ధి ఊపందకుంటున్నాయని అన్నారు. జిల్లాలో పార్లమెంట్ గానీ..అసెంబ్లీ గానీ ఆయన ఎవరు అభ్యర్ధి అంటే వారినే మనం కలిసి కట్టుగా పని చేసి గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి కట్టుగా వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ప్రాంతంలో 4500 కోట్ల రూపాయలతో మూలపేట పోర్ట్ వస్తుంది అని ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. ఉద్దానం ప్రాంతానికి ఆఫ్ సోర్ రిజర్వాయర్.. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీరు పథకం, రెండు వందల పడకల హాస్పిటల్ తీసుకు వస్తున్నారని తెలిపారు.

Read Also : Anam : జగన్ పేదవాడు ఎందుకు అవుతాడని ప్రశ్నించిన ఆనం వెంకటరమణారెడ్డి