మాచర్ల టీడీపీ (Macherla TDP) ఇన్చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం, వాహనాలకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మాచర్ల (Macherla) ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో పరిస్థితి మరింత చేజారకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు . మాచర్లలో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు. ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
Also Read: TDP : గుంటూరు టీడీపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు