Site icon HashtagU Telugu

Durga temple : దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తుడు మృతి

Durga Temple

Durga Temple

ద‌స‌రా ఉత్స‌వాల స‌దర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉంది. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఇంద్ర‌కీలాద్రికి చేర‌కుంటున్నారు. అయితే అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన ఓ భ‌క్తుడు ద‌ర్శ‌నం అవ్వ‌క‌ముందే మ‌ర‌ణించాడు. జి. శ్రీరామ చంద్ర మూర్తి అనే భ‌క్తుడు దర్శనం కోసం ఉదయం 11:20 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. అయితే అమ్మవారి దర్శనం కాకముందే కుప్పకూలిపోయాడు. ఇంద్రకీలాద్రి కొండపై ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలోని వైద్యులు భక్తుడిని తక్షణమే పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించార‌ని.. ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్య, వైద్యాధికారిణి డాక్టర్ ఎం. సుహాసిని తెలిపారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీరామచంద్రమూర్తి మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడు డయాబెటిక్, గుండె సంబంధిత రోగిగా గుర్తించారు.

ఇటు ఆల‌యంలో ఏర్పాట్ల‌ను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. శుక్రవారం భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. భారీ సంఖ్యలో భక్తులు క్యూలో వేచి ఉండగా, వారి కుటుంబ సభ్యులను దర్శనానికి తీసుకెళ్లిన పోలీసు సిబ్బందిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మ‌రో వైపు దుర్గగుడిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు హ‌ల్చ‌ల్ చేశారు. తన కాన్వాయ్‌తో పాటు మ‌రో మూడు వాహనాలను కొండ‌పైకి తీసుకెళ్లారు. అయితే ఎమ్మెల్యే వాహ‌నానికి మాత్ర‌మే అనుమతి ఇచ్చిన పోలీసులు మిగిలిన మూడు వాహ‌నాల‌ను ఆపేశారు. దీంతో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి పోలీసుల‌పై చిందులేశారు. కొండ‌పై ర‌చ్చ చేసిన త‌రువాత పోలీసులు మిగిలిన వాహ‌నాల‌ను కూడా అనుమ‌తించారు.