AP : జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోవడం ఖాయం – దేవినేని ఉమా

ఐదేళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గ పరిపాలన చూసి... దేశవిదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలకు గ్రామాలు మండుటెండలో మూడ్నాలుగు గంటలు నిలబడి ప్రజలు ఓటేశారు

  • Written By:
  • Publish Date - May 16, 2024 / 06:15 PM IST

ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. మే 13 న రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ (AP Election Polling) జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం (Polling Percentage) పెరగడం తో ఓటర్లు ఎవరికీ సపోర్ట్ చేశారనేది అందరిలో ఆసక్తి గా మారింది. పోలింగ్ శాతం పెరగడం మాకు అనుకూలంగా ఉండబోతుందంటూ వైసీపీ ఇటు కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం జగన్ తొలిసారి ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

గురువారం ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ (CM Jagan) భేటీ అయ్యారు. బెంజ్‌ సర్కిల్‌లోని ఐప్యాక్‌ (IPAC Team) కార్యాలయానికి వెళ్లిన జగన్‌.. వారితో కాసేపు ముచ్చటించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. గురువారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలతో జగన్ షాక్ కు గురవుతాడని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారని చెప్పుకొచ్చారు.

“ఐదేళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గ పరిపాలన చూసి… దేశవిదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలకు గ్రామాలు మండుటెండలో మూడ్నాలుగు గంటలు నిలబడి ప్రజలు ఓటేశారు. అటు వెయ్యిమంది, ఇటు వెయ్యిమంది రాళ్లు విసురుకుంటున్నా… పల్నాడులో మహిళలు కాంపౌండ్ వాల్ దాటిపోకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు అని” ఉమా తెలిపారు. ఈ ఐదేళ్లు ఏం ఉద్ధరించావని మళ్లీ అధికారంలోకి వస్తావని కలలు కంటున్నావు? నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి అని చెప్పుకొచ్చారు.

Read Also : Love Me Trailer : ‘లవ్ మీ’ ట్రైలర్ చూశారా.. దయ్యం ప్రేమ కోసం హీరో..