Site icon HashtagU Telugu

Amaravathi : అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు

Amaravathi Latest Update

Amaravathi Latest Update

అమరావతి(Amaravathi)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం (CBN Govt) కీలక నిర్ణయం తీసుకుంది. CRDA అథారిటీ సమావేశంలో రూ.11,467 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టాలని నిర్ణయించారు. టెండర్లు పిలిచి వీటిని త్వరలో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కానుంది.

Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్‌

CRDA కమిషనర్‌కు సంబంధిత పనులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. టెండర్లు పిలిచే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనీ, పనుల అమలు పట్ల నిఘా ఉండాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే నిధుల కేటాయింపుపై చర్చలు పూర్తయ్యాయి. ఈ నిధులతో రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు, విద్యుత్, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. అలాగే, పర్యావరణ హితమైన మౌలిక వసతులు నిర్మించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అమరావతి నగరంలో ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు బాగా మెరుగవుతాయి.

ఈ సందర్భంగా పురపాలక కార్యదర్శి కన్నబాబు (Kannababu) మాట్లాడుతూ.. “అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిబద్ధత దృఢంగా ఉంది. ఈ ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతో పాటు, రాబోయే తరాలకు గొప్ప నాంది అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధి కొత్త దశకు చేరుకోవడంలో కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, పనులు వేగవంతంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే, అమరావతిని ప్రజల కాంక్షల నగరంగా తీర్చిదిద్దగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.