Site icon HashtagU Telugu

CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు

Development and welfare are the two eyes of the NDA alliance: CM Chandrababu

Development and welfare are the two eyes of the NDA alliance: CM Chandrababu

CM Chandrababu : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటితో నిండు ఏడాది పూర్తైన సందర్భంగా, గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నారు. మేము ముందు నుంచి ఒక విషయాన్ని స్పష్టం చేశాం. సంపదను సృష్టించి, దానిని సమర్థంగా వినియోగిస్తాం. ఆ ఆదాయాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వెచ్చిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ‘తల్లికి వందనం’ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: CM Chandrababu : అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం అందుతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,091 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.1,346 కోట్లు స్కూళ్ల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు. పాత ప్రభుత్వ హయాంలో అమలైన ‘అమ్మఒడి’ పథకాన్ని ఆధారంగా తీసుకుని, ‘తల్లికి వందనం’ పేరుతో మరింత విస్తరించారు. అప్పట్లో ఒక్కో కుటుంబానికి ఒకరికి మాత్రమే మేలు జరిగేదంటే, ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రయోజనం అందేలా చేశారు. పాత ప్రభుత్వ హయాంలో 42,61,965 మందికి మాత్రమే ఈ పథకం వర్తించగా, ఇప్పుడు 67,27,164 మంది విద్యార్థులకు అమలవుతోంది. ఇది గత కంటే అదనంగా 24,65,199 మంది. అప్పట్లో రూ.5,540 కోట్లను కేటాయించగా, ప్రస్తుతం రూ.8,745 కోట్లు వెచ్చిస్తున్నారు. అదనంగా రూ.3,205 కోట్లు వినియోగిస్తున్నట్టు సీఎం వివరించారు.

తల్లులు లేని విద్యార్థుల విషయంలో, వారి తండ్రులు లేదా సంరక్షకుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తామని తెలిపారు. అనాథ విద్యార్థుల విషయాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయించి వారికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పథకం అందరికీ పారదర్శకంగా అందేలా గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను అందుబాటులో ఉంచుతారు. ఇంకా చంద్రబాబు తెలిపారు. పథకం అమలులో ఎక్కడైనా సమస్యలు తలెత్తిన పక్షంలో తక్షణమే స్పందిస్తాం. ఇందుకోసం జూన్ 26వ తేదీ వరకు ఫిర్యాదులు స్వీకరించి, జూన్ 30న తుది జాబితాను విడుదల చేస్తాం. ప్రజల సంక్షేమమే మా ప్రథమ లక్ష్యం. సంక్షేమం మరియు అభివృద్ధి ఒకదానికొకటి విరుద్ధం కాదని, రెండూ సమాంతరంగా సాగాల్సినవని మా పాలన స్పష్టం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్ర‌మాణానికి ఏడాది.. జనసేన ఆసక్తికరమైన వీడియో