Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan : మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అందర్నీ ఆకర్షించాయి

Published By: HashtagU Telugu Desk
Pawan Korika

Pawan Korika

ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాలనలో తనకు అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, పల్లెల అభివృద్ధిపై చూపిస్తున్న ఆసక్తి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అందర్నీ ఆకర్షించాయి. పాలనా అనుభవం తక్కువని తానే బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా పవన్ తన నిజాయితీని మరోసారి నిరూపించారు. కానీ తన శాఖ పరిధిలో ఎవరి మాటకూ లోనవకుండా పని చేస్తున్నామని, అధికారులూ అదే విధంగా తన ఆదేశాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

Natural Star Nani : ఛాన్స్ ఇచ్చిన నాని..షాక్ లో హీరోయిన్

డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్ని ఎంచుకోవడం ద్వారా పవన్ తన దృష్టి పల్లె వైపు ఉందని స్పష్టంగా తెలియజేశారు. పల్లెల్లో నివసించే అవకాశం తనకు లేనప్పటికీ, పల్లె అభివృద్ధిలో భాగం కావడం సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 70-80 శాతం పంచాయతీల్లో వైసీపీకి చెందిన వారే సర్పంచులు ఉన్నప్పటికీ, వారిని రాజకీయ ప్రభావం లేకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి రాజకీయాలు అడ్డుకాదన్న సందేశాన్ని పవన్ క్లియర్‌గా ఇచ్చారు.

పల్లెలు వర్గ పోరులు, కుల రాజకీయాల్లో చిక్కుకుపోయినా వాటిని బయటకు తీసుకురావడం తన లక్ష్యమని పవన్ చెప్పారు. “గ్రామం గ్రామమే, సర్పంచ్ సర్పంచే” అనే నినాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలో రాజకీయ సంబంధాలు చూడకుండా గ్రామస్థాయిలో నిధులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పాలనా అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, బాధ్యతతో వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో విజయవంతమవుతున్నారు.

  Last Updated: 24 Apr 2025, 04:00 PM IST