CM Jagan: 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే కొంతమంది ఎకౌంట్లు సెటిల్ చేస్తాడంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఎవరి అకౌంట్ లు సెటిల్ చేయాలో చేసి తీరుతాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై చేస్తున్న విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నాడని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పాతాళంలోకి తొక్కుతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ధర్మం గెలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సత్యనారాయణ.
Also Read: Cooking: స్నానం చేయకుండా వంట చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన వాలంటీర్లపై చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. డిబెట్లు పెట్టారు. ఢిల్లీ నిఘా సంస్థలు పవన్ కళ్యాణ్ కి డేటా ఎలా లీక్ చేస్తారని, ఒకవేళ డేటా ఉంటే న్యాయపరంగా వెళ్లొచ్చు కదా అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది. అయితే సీన్ రివర్స్ కావడంతో పవన్ కళ్యాణ్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదంటూ, వాలంటీర్లను అనలేదని, ఆ వ్యవస్థను తప్పుబట్టానని పవన్ సర్ది చెప్పుకున్నాడు. వాలంటీర్ ఇష్యూ ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు.
Also Read: MS Dhoni: ధోనీ ముందు అన్నీ మూసుకుని ఉండిపోతా