Delhi Road Map : ఒకే వేదిక‌పై పురంధ‌రేశ్వ‌రి, ప‌వ‌న్.! NDA స‌మావేశం త‌రువాత‌..?

`ఢిల్లీ బీజేపీతో (Delhi Road Map)మాత్రమే జ‌న‌సేన‌కు పొత్తు..` అంటూ ప‌లుమార్లు ప‌వ‌న్ చెప్పారు.రాష్ట్రాల్లోని బీజేపీతో సంబంధంలేద‌న్న‌మాట‌.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 04:01 PM IST

`ఢిల్లీ బీజేపీతో (Delhi Road Map)మాత్రమే జ‌న‌సేన‌కు పొత్తు..` అంటూ ప‌లుమార్లు ప‌వ‌న్ చెప్పారు. అంటే, రాష్ట్రాల్లోని బీజేపీ విభాగాల‌తో ఏ మాత్రం సంబంధంలేద‌న్న‌మాట‌. ఆ త‌ర‌హాలోనే బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఏపీలో కొన‌సాగుతోంది. ఆయ‌న చెప్పిన విధంగా ఎన్డీయే స‌మావేశానికి జ‌న‌సేనకు ఆహ్వానం ల‌భించింది. అదే స‌మ‌యంలో జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళుతోన్న పురంధరేశ్వ‌రితో క‌లిసి ప‌ర్య‌టించేందుకు ప‌వ‌న్ సిద్దంగా లేరు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో కలిసి వెళితే మునిగిపోతామ‌న్న అంచ‌నా జ‌న‌సేన‌కు ఉందని తెలుస్తోంది. అందుకే, ఢిల్లీ బీజేపీతో మాత్ర‌మే పొత్తు అనేది ప‌వ‌న్ చాలా కాలంగా చెబుతున్నారు.

బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఏపీలో..Delhi Road Map

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చూస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ బీజేపీని దూరంగా పెడుతున్నారు. ఆ పార్టీతో క‌లిసి ఏపీలో అడుగు వేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలుగా పురంధరేశ్వ‌రి నియామ‌కాన్ని ప‌వ‌న్ ఆహ్వానించారు. కానీ, ఆమెతో క‌లిసి వేదిక‌ల‌ను పంచుకోవ‌డానికి ముందుకురాలేక‌పోతున్నారు. ఈనెల 13న బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి బూత్, మండ‌ల క‌మిటీలు వేయాల‌ని నిర్ణ‌యించారు. అదే ప‌నిలో జ‌న‌సేన కూడా ఉంది. ఇలా ఎవ‌రికి వారే ఒంట‌రిగా ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పొత్తు అనే అంశానికి అర్థంలేకుండా (Delhi Road Map)రాజ‌కీయాలను ఆ రెండు పార్టీలు న‌డ‌ప‌డం స‌రికొత్త ప‌రిణామం.

పురంధరేశ్వరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి రూట్ మ్యాప్

కొత్త‌గా ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న పురంధరేశ్వరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి ప్రాంతాలలో పర్యటించ‌నున్నారు. ఆమేర‌కు షెడ్యూల్ ను ఖ‌రారు చేశారు. ఈనెల‌ 23తేదీన రాయ‌సీమ‌లోని నేత‌ల‌తో ప్రొద్దుటూరులో ఆ జిల్లా ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొంటారు. అలాగే, 25న కోస్తా నేతలతో గుంటూరులో పాల్గొంటారు. 26న గోదావరి జిల్లా నేతలతో రాజమండ్రిలో సమావేశం అవుతారు. 27వ తేదీన ఉత్తరాంధ్ర నేతలతో విశాఖలో భేటీ అవుతారు. రూట్ మ్యాప్ ను త‌యారు చేసుకున్నా ఆమె జిల్లా స‌మావేశాల్లో ఒక దిశానిర్దేశం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద  (Delhi Road Map)వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌బోతున్నారు.

పురంధ‌రేశ్వరి త‌న ప‌ర్య‌ట‌న‌లో క్యాడ‌ర్ కు దిశానిర్దేశం

రాష్ట్రం విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత కేంద్రం ఏపీకి కొన్ని ప‌నులు చేసింది. అలాగే, కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. వాటి గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డానికి ఆధారాల‌ను పురంధ‌రేశ్వ‌రి సేక‌రించారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ఇస్తోన్న ప‌థ‌కాల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత ట్యాగ్ తో ఎలా ప్ర‌చారం చేసుకుంటున్నారు? అనే అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకోబోతున్నారు. ఆయా జిల్లాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన దోపిడీని బయ‌ట‌పెడుతూ రాష్ట్రానికి కేంద్రం చేసిన మేలును  (Delhi Road Map) వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు పురంధ‌రేశ్వరి త‌న ప‌ర్య‌ట‌న‌లో క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

Also Read : BJP Leader Kidnapped: హైదరాబాద్ లో బీజేపీ లీడర్ కిడ్నాప్.. భూ వివాదమే కారణం

ఈనెల 18న జ‌రిగే ఎన్డీయే స‌మావేశం త‌రువాత ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్థితులు మారే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర బీజేపీకి దూరంగా ఉంటూ రాజ‌కీయాలు చేసిన ప‌వ‌న్ వ్యూహాన్ని మార్చ‌కోబోతున్నార‌ని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ పురంధ‌రేశ్వ‌రితో క‌లిసి వేదిక‌లను పుంచుకునేలా కేంద్ర బీజేపీ పెద్ద‌లు ఒక బ్లూ ప్రింట్ ను ప‌వ‌న్ కు ఇస్తార‌ని వినికిడి. ఏపీలో కింగ్ మేక‌ర్ అయ్యేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని చూస్తున్నారు. అందుకే, వారాహి యాత్ర సంద‌ర్భంగా రాజ‌కీయాన్ని ప‌వ‌న్ ర‌క్తికట్టించారు. ఇక బీజేపీ, జ‌న‌సేన ఒకే వేదిక‌పైకి వ‌స్తే ముక్కోణ‌పు ప్ర‌చారం ఊపందుకోనుంది. అప్పుడు అస‌లు సిస‌లైన రాజ‌కీయ ఆటను ఏపీలో చూడ‌బోతున్నమాట‌.

Also Read : AP BJP : నేడు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న పురంధేశ్వ‌రి