Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Delhi Jagan) మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. కానీ, ఆయ‌న 2గంట‌ల పాటు హ‌స్తిన వేదిక మీద మాయం అయ్యారు.

  • Written By:
  • Updated On - May 29, 2023 / 03:41 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Delhi Jagan) మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. కానీ, ఆయ‌న 2గంట‌ల పాటు హ‌స్తిన వేదిక మీద మాయం అయ్యారు. ఎక్క‌డ‌కు వెళ్లారు? ఎవ‌ర్ని క‌లిశారు? చీక‌టి రాజ‌కీయం ఏమి జ‌రిగింది? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లోని ప్ర‌ధాన చ‌ర్చ‌. ఢిల్లీ పెద్ద‌ల అండ కార‌ణంగా మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి (Viveka murder) హ‌త్య కేసు విచార‌ణ ఆల‌స్యం అవుతుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ద‌ర్యాప్తు వేగంగా జ‌ర‌గ‌కుండా ఏదో అదృశ్యశ‌క్తి అడ్డుప‌డుతుంద‌ని విప‌క్షాల అనుమానం. దానికి బ‌లం చేకూరేలా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంతులేని క‌థ‌లా సాగుతోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  2గంట‌ల పాటు హ‌స్తిన వేదిక మీద మాయం (Delhi Jagan) 

ప్ర‌త్యేక విమానంలో ఈనెల 26న సాయంత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Delhi) ఢిల్లీ వెళ్లారు. మ‌రుస‌టి రోజు(27వ తేదీ) నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి అమిత్ షాను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అపాయిట్మెంట్ ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ రెండు గంటల పాటు ఆ రాత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌నిపించ‌కుండా వెళ్లార‌ట‌. ఆ రెండు గంట‌ల‌కు న్యాయ‌వాదుల‌ను క‌లిసేందుకు వెళ్లార‌ని కొంద‌రు, చీక‌ట్లో ఢిల్లీ పెద్ద‌ల‌తో రాజ‌కీయం చేయ‌డానికి వెళ్లార‌ని మ‌రికొంద‌రు హ‌స్తిన‌లో చ‌ర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి కేసు విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఈ చీక‌టి రాజ‌కీయ‌మంటూ విప‌క్షాలు చేస్తోన్న రాద్దాంతం.

లైజ‌నింగ్ మీద అవినాష్ రెడ్డి  అరెస్ట్ ఆధార‌ప‌డి

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి (Viveka murder) హ‌త్య కేసులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరును కూడా తెలంగాణ హైకోర్టులో సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాదులు ప్ర‌స్తావించారు. హ‌త్య‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను సీల్డ్ క‌వ‌ర్లోనూ కోర్టుకు అందించారు. ర‌హ‌స్యంగా చేసిన విచార‌ణ తాలూకూ ఆధారాల‌ను కూడా కోర్టుకు అందించారు. అంతేకాదు, సూత్ర‌ధారిగా అవినాష్ రెడ్డి ఉన్నార‌ని నిరూపించే ఆధారాల‌ను కూడా అందించారు. అందుకే, అవినాష్ రెడ్డిని క‌స్టోడియ‌న్ విచార‌ణ చేయాల‌ని సీబీఐ చెబుతోంది. తెలంగాణ హైకోర్టు మాత్రం ఈనెల 31వ తేదీ వ‌ర‌కు అరెస్ట్ లేకుండా అవినాష్ రెడ్డి ఊర‌ట‌ను ఇస్తూ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో ఢిల్లీ లైజ‌నింగ్ మీద అవినాష్ రెడ్డి(Avinash Reddy)  అరెస్ట్ ఆధార‌ప‌డి ఉంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చీక‌ట్లో ఢిల్లీ పెద్ల‌తో రాజ‌కీయం న‌డిపార‌ని న‌మ్మేవాళ్లు అనేకం.

Also Read : Viveka Murder : జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన వేళ..అవినాష్ రెడ్డికి ఊర‌ట‌

పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వానికి వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని పెద్ద‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ట్టించుకోలేద‌ని ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా ఫోక‌స్ చేసింది. అంతేకాదు, అపాయిట్మెంట్ కూడా మోడీ ఆఫీస్ ఇవ్వ‌లేదు. దీంతో తిరిగి తాడేప‌ల్లికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేరుకున్నారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ వేగ‌వంతం అయిన‌ప్పుడల్లా ఢిల్లీ వెళ్లే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Delhi Jagan)  ఈసారి కూడా అలాగే వెళ్లార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అందుకే, మోడీ అపాయిట్మెంట్ ఇవ్వ‌లేద‌ని కూడా ప్ర‌చారం మొద‌లు అయింది. ఈ కేసుతో ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు కూడా చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని గ్ర‌హించార‌ట‌. పార్టీకి కూడా న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌రో ఆప్ష‌న్ కోసం చీక‌టి రాజ‌కీయం న‌డిపార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌. ఆ రెండు గంట‌లు ఎక్క‌డ‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాయం అయ్యారు? అనేది బ‌య‌ట‌కు వ‌స్తే వివేక హ‌త్య విచార‌ణ మీద ఆయ‌న చేసిన ఆప‌రేష‌న్ ఏమిటో బ‌య‌ట‌కు రానుంది.

Also Read : Jagan Delhi : ప్ర‌త్యేక విమానంలో జ‌గ‌న్ ఢిల్లీకి..ఇక అవినాష్ సేఫ్‌ ?