Delhi Game in AP : BJPచ‌ద‌రంగంలో ప‌వ‌న్! పొత్తుపై ఫోక‌స్!

పీలో బీజేపీ, జ‌నసేన పొత్తు ఉందా? అంటే ఉందని ఇరు పార్టీల నేత‌లు  (Delhi Game in AP) చెబుతారు. ప‌వ‌న్ ఢిల్లీ బీజేపీతో మాత్ర‌మే పొత్తు అంటారు.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 02:24 PM IST

ఏపీలో బీజేపీ, జ‌నసేన పొత్తు ఉందా? అంటే ఉందని ఇరు పార్టీల నేత‌లు  (Delhi Game in AP) చెబుతారు. కానీ, ప‌వ‌న్ మాత్రం ఢిల్లీ బీజేపీతో మాత్ర‌మే పొత్తు అంటారు. రాజ‌కీయాల్లో ఇదో స‌రికొత్త ఒర‌వ‌డి. ఇక జ‌న‌సేన పార్టీతో పొత్తు ఉంటుంద‌ని తాజాగా ఎంపీ జీవీఎల్ మీడియాకు వెల్ల‌డించారు. ఇక బీజేపీ, జ‌న‌సేన పొత్తు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌చారం చేయాల‌ని రాష్ట్ర కార్య‌వ‌ర్గానికి ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు పురంధ‌రేశ్వ‌రి  (Delhi Game in AP) దిశానిర్దేశం చేశారు. అంటే, ఏదో రాజ‌కీయ ప‌రిణామం ఏపీ రాజ‌కీయాల్లో పొంచి ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

బీజేపీ, జ‌న‌సేన పొత్తు గురించి ప్ర‌చారం చేయాల‌ని పురంధ‌రేశ్వ‌రి  దిశానిర్దేశం (Delhi Game in AP) 

రాష్ట్ర కార్య‌వ‌ర్గంతో వ‌ర్చువ‌ల్ మీటింగ్ పెట్టిన పురంధ‌రేశ్వ‌రి స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మూడు రోజుల ప్రోగ్రామ్స్ కు పిలుపునిచ్చారు. ఈనెల 14న విభాజిత్, విభీషణ్ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఆ రాత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శనను విజయవంతం చేయాలని సూచించారు. ఇదే మీటింగ్ లో జ‌న‌సేన‌తో బీజేపీకి పొత్తు అంశాన్ని ప్ర‌త్యేకంగా హైలెట్  (Delhi Game in AP) చేయాల‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆమె బీజేపీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప‌వ‌న్ తో క‌లిసి అడుగు వేయ‌లేదు. అలాగని ప‌వ‌న్ బీజేపీ ఆఫీస్ కు వ‌చ్చి ఆమెను విష్ చేయలేదు. కానీ, ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు మాత్రం ఉందని చెబుతుంటారు.

జ‌న‌సేన‌తో మాత్ర‌మే బీజేపీ పొత్తు ఉంటుంద‌ని ఎంపీ జీవీఎల్

ప్రభుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి   ఉంటుంద‌ని ప‌వ‌న్ అంటారు. ఆ మేర‌కు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని కూడా ఢిల్లీ వెళ్లిన  (Delhi Game in AP) సంద‌ర్భాలు లేక‌పోలేదు. కానీ, బీజేపీ ఎంపీ జీవీఎల్ మాత్రం జ‌న‌సేన‌తో మాత్ర‌మే బీజేపీ పొత్తు ఉంటుంద‌ని చెబుతున్నారు. అంటే, తెలుగుదేశం పార్టీతో క‌లిసి న‌డ‌వ‌లేమ‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం పొత్తుల విష‌యంలో మౌనంగా ఉంటోంది. కానీ, ప‌వ‌న్, చంద్ర‌బాబు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న ఉంద‌ని ఇరు పార్టీల లీడ‌ర్లు చెప్పుకుంటున్నారు. సీట్ల స‌ర్దుబాటుపై మీద కూడా అవ‌గాహ‌న ఉంద‌ని టాక్‌. ఆ మేర‌కు మాత్ర‌మే ఇరు పార్టీలు అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేస్తున్నార‌ని ఆ రెండు పార్టీల్లోని  కీల‌క కోట‌రీల్లోని చ‌ర్చ‌.

బీజేపీతో క‌లిసి వెళితే రాజకీయంగా మునిగిపోతామ‌ని జ‌న‌సేన

తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్ల‌డానికి మాన‌సికంగా ప‌వ‌న్ సిద్ద‌మ‌య్యార‌ని ఆయ‌న అనుచరుల్లోని టాక్‌. లేదంటే, రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం త‌ప్ప‌ద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, బీజేపీని వీడేందుకు కూడా సిద్ధ‌మ‌న్న‌ట్టు సంకేతాలు జ‌న‌సేన ఇస్తోంది. ఆ క్ర‌మంలో జ‌న‌సేన‌తో పొత్తు ఉంద‌ని విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఆ రెండు పార్టీలు ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి క్షేత్ర‌స్థాయిలో ఒక ప్రోగ్రామ్ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేయ‌లేదు. ఎవ‌రికివారే ప్రోగ్రామ్ లు చేసుకుంటున్నారు. తొలి నుంచి ప‌వ‌న్ మాత్రం కేవ‌లం ఢిల్లీ బీజేపీతో  (Delhi Game in AP) మాత్ర‌మే పొత్తు అంటున్నారు. త‌ద్భిన్నంగా రాష్ట్ర బీజేపీ మాత్రం జ‌న‌సేన‌తో పొత్తు ఉందని చెబుతూ ఏనాడూ ఆ పార్టీకి గౌర‌వం ఇవ్వ‌లేదు.

Also Read : Janasena Effect : ఏపీలో `బండి` మార్క్ రాజ‌కీయం, ప‌వ‌న్ కు జ‌ల‌క్‌

తిరుప‌తి లోక్ స‌భ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డానికి ముందుగా ఎలాంటి సంప్ర‌దింపులు జ‌న‌సేన‌తో బీజేపీ జ‌ర‌ప‌లేదు. ఆత్మ‌కూరు, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్బంగా జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేయ‌లేదు. జ‌న‌సేన కూడా బీజేపీతో క‌లిసి ఎప్పుడూ పోటీ చేయ‌లేదు. స్థానిక ఎన్నిక‌ల్లోనూ కొన్ని చోట్ల టీడీపీతో క‌లిసి ప‌నిచేసింది. కానీ, బీజేపీతో మాత్రం క‌లిసి అభ్య‌ర్థుల‌ను ఎక్క‌డా నిల‌ప‌లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు అంటూ ఫోక‌స్ చేస్తున్నారు. దీని వెనుక రాజ‌కీయ కార‌ణాలు అనేకం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీతో క‌లిసి వెళితే రాజకీయంగా మునిగిపోతామ‌ని జ‌న‌సేన కు ఉన్న స‌ర్వేల సారాంశం. ఒక జ‌న‌సేన‌తో పొత్తు లేకుండా ప్ర‌జ‌ల్లోకి వెళితే సింగిల్ డిజిట్ ఓట్లు కూడా రావ‌ల‌ని బీజేపీ ఆందోళ‌న‌. ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఆ రెండు పార్టీల్లోనూ ఉన్నాయి. అందుకే, పైకి పొత్తు అంటూనే ఎవ‌రివారు  (Delhi Game in AP) రాజ‌కీయ ఆట ఆడుతున్నారు.

Also Read : CBN-Daggupati : తోడ‌ళ్లుల్ల మ‌ధ్య జ‌గ‌న్ స్కెచ్! ద‌గ్గుబాటి ఆప్తుడికి ప‌ర్చూరు

తెలుగుదేశం పార్టీ మాత్రం జ‌న‌సేన పార్టీని క‌లుపుకుని పోయేందుకు సిద్ధంగా ఉంది. కానీ, బీజేపీతో క‌లిసి వెళ్ల‌డానికి సందేహిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకర‌ణ‌, అమ‌రావ‌తి రాజ‌ధాని, విశాఖ రైల్వే, పోల‌వ‌రం త‌దిత‌ర అంశాల దృప్ట్యా బీజేపీ మీద వ్య‌తిరేక‌త ఉంది. అంతేకాదు, రాజ‌కీయంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌హ‌కారం అందిస్తోంద‌ని స‌గ‌టు ఓట‌రుకు ఉన్న అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని క‌లుపుకుని వెళితే మునిగిపోతామ‌ని టీడీపీకి ఉన్న స‌ర్వేల సారాంశం. బీజేపీని వీడి జ‌న‌సేన రావాల‌ని కోరుకుంటోంది. కానీ, బీజేపీని వీడేందుకు అనుకూల వాతావ‌ర‌ణం లేకుండా ప‌వ‌న్ మీద ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఏపీ బీజేపీ నేత‌ల ద్వారా చ‌ద‌రంగం అడుతున్నారు. ఆ క్ర‌మంలోనే జీవీఎల్, పురంధ‌రేశ్వ‌రి ఇద్ద‌రూ జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు అనే అంశాన్ని బ‌లంగా తీసుకెళ్ల‌డానికి (Delhi Game in AP) దిశానిర్దేశం క్యాడ‌ర్ కు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌సేనాని ఎలా భ‌య‌ప‌డ‌తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.