Delhi CEC : TDP, YCPప‌ర‌స్ప‌ర ఫిర్యాదు!YCP ర‌ద్దుకు CBN డిమాండ్!!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Delhi CEC) వ‌ద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దొంగ ఓట్ల ఫిర్యాదుకు రంగంలోకి దిగాయి. చంద్ర‌బాబు అండ్ టీమ్ ఫిర్యాదు చేసింది

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 05:29 PM IST

కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Delhi CEC) వ‌ద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దొంగ ఓట్ల ఫిర్యాదుకు రంగంలోకి దిగాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అండ్ టీమ్ ఫిర్యాదు చేసింది. ఆధారాల‌తో స‌హా అందించింది. దొంగ ఓట్ల‌ను చేర్చ‌డంతో పాటు ఓట‌ర్ ఐడీ కార్డుల‌ను త‌ప్పుడు నెంబ‌ర్ల‌తో క్రియేట్ చేసిన వైనాన్ని వివ‌రించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ 25వేలకు త‌గ్గ‌కుండా టీడీపీ అభిమానులు, సానుభూతిప‌రులు ఓట్ల‌ను తొల‌గించ‌డానికి వైసీపీ సిద్ద‌మ‌యింద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ మేర‌కు కొన్ని నియోక‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ఆధారాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ప్రొడ్యూస్ చేసింది. న్యాయ‌పోరాటం కూడా చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఓట్ల తొల‌గింపు, దొంగ ఓట్ల న‌మోదును వేగంగా వైసీపీ చేస్తోంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద మొర‌పెట్టుకుంది.

టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దొంగ ఓట్ల ఫిర్యాదు(Delhi CEC) 

రాష్ట్రంలో ఓట‌ర్ల లిస్ట్ త‌యారు చేయ‌డానికి ఐఏఎస్ ల‌తో కూడిన హైలెవ‌ల్ క‌మిటీని వేయాల‌ని ఈసీకి (Delhi CEC)చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రానికి చెందిన సివిల్ స‌ర్వెంట్లు కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన అధికారుల‌ను నియ‌మించ‌డం ద్వారా న్యాయం చేయాల‌ని కోరారు. ఏపీలోని ఉర‌వ‌కొండ‌, విశాఖ‌, మైల‌వ‌రం త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో 15 నుంచి 20వేల ఓట్ల‌ను తొల‌గించారు. అంతే మొత్తంలో దొంగ ఓట్ల‌ను చేర్చారు. దీనిపై ఫిర్యాదు చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ఓట‌ర్ల జాబితా స‌మీక్ష‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ అరాచ‌కాలు ఆగ‌లేద‌ని టీడీపీ భావించింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లుసుకుని చంద్ర‌బాబు ఫిర్యాదు చేశారు.

ఐఏఎస్ ల‌తో  హైలెవ‌ల్ క‌మిటీని వేయాల‌ని ఈసీకి చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి

కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద‌కు టీడీపీ వెళ్లిన స‌మ‌యంలోనే వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి అండ్ టీమ్ అక్క‌డ‌కు వెళ్లింది. ప్ర‌తిప‌క్ష టీడీపీ జాబితాలోని వైసీపీ సానుభూతిప‌రులు, అభిమానుల పేర్ల‌ను తొల‌గిస్తుంద‌ని ఫిర్యాదు చేయ‌డం విచిత్రం. సాధారణంగా అధికార‌ప‌క్షం మీద ప్ర‌తిప‌క్షం ఇలాంటి ఫిర్యాదు చేస్తుంది. కానీ, విచిత్రంగా ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ మీద ఫిర్యాదు చేయ‌డం వైసీపీ మైండ్ గేమ్ లోని హైలెట్ పాయింట్ . స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఓట‌ర్ల‌ను భ‌య‌కంపితుల‌ను అధికార‌ప‌క్షం చేసింది. నామినేష‌న్లు వేయ‌డానికి ముందుకు రాకుండా టీడీపీ అభ్య‌ర్థుల‌ను వెంబ‌డించి దాడి చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం. మున్సిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ అదే జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఓట‌ర్ల జాబితాను తారుమారు చేయ‌డానికి వైసీపీ ప‌లు ప్ర‌యత్నాలు చేసింది. ఈ ప‌రిణామాల‌ను వివ‌రిస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ కు (Delhi CEC)చంద్ర‌బాబు రాత‌పూర్వ‌క ఫిర్యాదును అందించారు.

Also Read : CBN target : వైసీపీ బ‌లంపై చంద్ర‌బాబు గురి

తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదుకు ప్ర‌తిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద విజ‌య‌సాయిరెడ్డి అండ్ కో రాత‌పూర్వ‌క ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షం అరాచ‌కాలు చేస్తుంద‌ని వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డానికి అక్ర‌మ మార్గాల‌ను ఎంచుకుంటుంద‌ని ఆరోపించింది. ఇలా పోటాపోటీగా ఫిర్యాదు చేసుకోవ‌డంతో ఢిల్లీలోని ఈసీ ఆఫీస్‌ కేంద్రంగా చేసుకుని ఏపీ రాజ‌కీయం వేడెక్కింది. వాస్తవంగా ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ట్రిక్ట్ గా ప‌నిచేస్తే, అధికారులు కూడా స‌వ్వంగా న‌డుచుకుంటారు. రాష్ట్రంలోని పార్టీకి కొమ్ముకాయ‌కుండా చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఓట‌ర్ల జాబితాను త‌ప్పులు లేకుండా చేసే బాధ్య‌త ఈసీ మీద ఉంటుంది. అక్ర‌మాల‌కు పాల్ప‌డే పార్టీల గుర్తింపు ర‌ద్దు చేసే అధికారం కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఉంది. కానీ, ఇప్పుడు నెల‌కొన్ని ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్ష టీడీపీ ఓట్ల జాబితాను కాపాడుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అవ‌స‌ర‌మైతే, వైసీపీ గుర్తింపు ర‌ద్దు చేయాల‌ని ఈసీని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం కొస‌మెరుపు.

Also Read : CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్