Site icon HashtagU Telugu

YS Sharmila : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల

Sharmila Declaration On Spe

Sharmila Declaration On Spe

తిరుపతి (Tirupati)లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ (Declaration on Special Status) విడుదల చేసారు ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila). తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ప్రకటించారు. ”ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి అని షర్మిల పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో ఉంది. అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్నా.. ప్రత్యేక హోదా కోసం చేరా. అది రాష్ట్ర ప్రజల హక్కు.

We’re now on WhatsApp. Click to Join.

తిరుపతిలో ఇదే మైదానంలో మోడీ అనేక హామీలు ఇచ్చారు. అద్భుతమైన రాజధాని కడతామన్నారు. రాష్ట్రాన్ని హార్డ్‌వేర్‌ హబ్‌ చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తాం.. పోలవరం కట్టిస్తామన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? కేంద్రం పదేళ్లుగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది. పక్కనున్న రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. దక్షిణాదిలో మెట్రో రైలు లేని రాష్ట్రం మనదే” అని షర్మిల చెప్పుకొచ్చారు. ఈ సభకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ జాతీయ నేత సచిన్ పైలట్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

Read Also : Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన