AP News : తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు ప్రాంతంలోని రంగనాథం వీధిలో నిలిపి ఉంచిన ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతులను వినయ్, దిలీప్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు, విచారణ చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వారు బీర్లు తాగిన మత్తులో కారులో నిద్రించారు. అయితే AC లేకపోవడం లేదా పూర్ణ మత్తులో శ్వాస ఆడక మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కారులో నుండి నాలుగు బీరు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై సాయి నాధ్ చౌదరీ తెలిపారు. ఇద్దరు యువకులు ఎలా మృతి చెందారు? మద్యం వల్లే శ్వాస ఆగిందా? లేక ఇంకేదైనా కారణముందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఘటనపై పూర్తి నివేదిక రావాల్సి ఉంది.
Reactor Blast: పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు..