Site icon HashtagU Telugu

Pithapuram : ముద్రగడ బండారం బయటపెట్టిన కూతురు..

Mudragada Kranthi

Mudragada Kranthi

గత నెల రోజులుగా ముద్రగడ (Mudragada Padmanabham) పేరు వార్తల్లో మారుమోగిపోతుంది. కాపు నేతగా ఎంతో పేరున్న ఆయన..ఇప్పుడు రెడ్డి నేత అనిపించుకుంటున్నాడు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఫై ఆయన చేస్తున్న ఆరోపణలే. పవన్ కళ్యాణ్ నన్ను కలవలేదని , చంద్రబాబు నుండి పిలుపు రాలేదని చెప్పి , వైసీపీ లో చేరిన ఆయన..చేరిన దగ్గరి నుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని , ఓడిస్తానని, ఓడించకపోతే తన పేరు మార్చుకుంటుంనంటూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తూ వస్తున్నారు. ఈయన సవాళ్ల కు జనసేన నుండి అంతే కౌంటర్లు వస్తున్నాయి.

ఈ తరుణంలో ఆయన కూతురు..ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. అంతే కాదు తాను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

“అందరికీ నమస్కారం. నేను క్రాంతి (Mudragada Kranthi). ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో వపన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి… పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదు.

వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్ గారని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. కేవలం పవన్ కల్యాణ్ గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కల్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా” అని ఆమె వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు.

Read Also : Chiranjeevi – NTR : రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి ఏమ్మన్నారంటే..