Site icon HashtagU Telugu

Dasara : అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రులు

Dasara Navaratri Utsavalu 2

Dasara Navaratri Utsavalu 2

Dasara Navaratri Utsavalu 2024 at Indrakeeladri : దసరా ఉత్సవాలకు (Dasara Celebrations) ఇంద్రకీలాద్రి (Indrakeeladri) సిద్ధమైంది..అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

దసరా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటదసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.

తెలంగాణా (Telangana)లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు.

ఇక విజయవాడ (Vijayawada) దుర్గ గుడిలో దసరాను ఎంతో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 3 నుంచి 12 వరకూ దసరా నవరాత్రులు జరుగుతాయని దుర్గగుడి కమిటీ తెలిపింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ డా. సృజన అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా వచ్చిందంటే చాలు నవరాత్రుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. గతేడాది దసరా ఉత్సవాలకు 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

సామాన్య భక్తులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా విపరీతమైన ఎండ కాసినా.. వర్షం వచ్చినా క్యూలైన్లలో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్స్‌ ఘాట్‌ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రికి వెళ్తాయి. అయితే ఇటీవల విజయవాడ నగరం మొత్తం వరదలతో ఇబ్బంది పడడంతో ఈసారి దసరా వేడుకలు గతంలోలా జరుగుతాయా లేదా ..అమ్మవారి వైభవాన్ని ఈ ఏడాది చూడగలమా లేదా అని భక్తులు సందేహపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రతి ఏడాదిలాగానే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తున్నారు.

Read Also :