AP : అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైసీపీ కార్యక్రమంగా మారింది – సీపీఐ రామకృష్ణ

విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకు ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్రహం, దాని చుట్టూ మ్యూజియం ఇంత భారీ నిర్మాణానికి […]

Published By: HashtagU Telugu Desk
Jagan Ambedkar Statue2

Jagan Ambedkar Statue2

విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకు ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్రహం, దాని చుట్టూ మ్యూజియం ఇంత భారీ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇదిలా ఉంటె ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబేద్కర్‌ గొప్పతనం కంటే వైసీపీ ప్రభుత్వ గొప్ప తనం..టీడీపీ , జనసేన పార్టీల ఫై విమర్శలే ఎక్కువయ్యాయి.

తాజాగా సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) సైతం ఇది అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలా లేదని , వైసీపీ కార్యక్రమంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు లోపలకు అనుమతించకపోవడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదు? పార్టీ జెండాలతో సభ నిర్వహించడం దుర్మార్గం. అభినవ అంబేద్కర్‌ అని జగన్‌ని పొగడటానికి సిగ్గుండాలి. వేల కోట్లు దోచుకుని జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్. మీకు సీట్లు, పదవుల కోసం అంబేద్కర్‌ని అవమానిస్తారా? జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు. దళితులను అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్. జగన్‌ను అభినవ అంబేడ్కర్‌ అంటే.. మహామనీషి అంబేద్కర్‌ను అవమానించడమే. పార్టీ కార్యక్రమాలకు అంబేద్కర్‌ స్మృతి వనం వినియోగమా? ఈరోజు సందర్శకులకు అనుమతి ఇవ్వకుండా ఆపడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు.

Read Also : CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డికి యువతి ఫ్లయింగ్‌ కిస్‌

  Last Updated: 20 Jan 2024, 01:56 PM IST