ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan) పై సీపీఐ నారాయణ(CPI Narayana ) తనదైన శైలిలో విమర్శలు సంధించారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సరిగా జరగకపోవడం వల్లే జగన్, ఆయన చెల్లెలు షర్మిళ మధ్య ఆస్తుల వివాదం చెలరేగుతోందని, కేంద్రం తలుచుకుంటే జగన్ ఎప్పుడో జైలుకు వెళ్లేవాడిని నారాయణ అన్నారు. జగన్ 11 ఏళ్లుగా అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్నారని, ఇది సాధారణ విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు.
జగన్ కేసుల విచారణకు సంబంధించి కేంద్రం దృష్టి ఉంచి ఉంటే ఆయన ఇప్పటికే జైలుకు వెళ్ళేవారని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ కేసులు బీజేపీ పెద్దల ఆధీనంలో ఉన్నాయని విమర్శించారు. ఇంతకాలం కేసు తేలకపోవడం, విచారణ ప్రక్రియ ఆలస్యం అవ్వడం వల్లే ఇప్పుడు ఆస్తుల గొడవ తెరమీదకు వచ్చిందని అన్నారు. కేంద్రం ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేసు క్లియర్ అయితే అన్నా-చెల్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదం కూడా తొలిగిపోతుందని నారాయణ అన్నారు.
Read Also : Karthika Masam : మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్